ETV Bharat / bharat

పంజాబ్​లో పోలింగ్​ ప్రశాంతం.. 63 శాతం ఓటింగ్​ - ఓటింగ్​

Punjab Assembly elections: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,304 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. సాయంత్రం ఐదు గంటల వరకు 63 శాతం పోలింగ్​ నమోదైంది.

Punjab Assembly election
పంజాబ్​లో పోలింగ్​ ప్రశాంతం
author img

By

Published : Feb 20, 2022, 6:00 PM IST

Punjab Assembly elections: పంజాబ్​ శాసనసభ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 23 జిల్లాల్లో 117 స్థానాలకు ఒకే దశలో ఆదివారం ఓటింగ్​ జరిగింది. ఉదయాన్ని పోలింగ్​ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రజలు. సాయంత్రం ఐదు గంటల వరకు 63.44 శాతం పోలింగ్​ నమోదైంది. ఈ ఎన్నికల్లో 93 మంది మహిళలు సహా మొత్తం 1,304 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.

Punjab Assembly election
ఓటింగ్​ కేంద్రాల వద్ద ప్రజలు, భద్రత ఏర్పాట్లు

పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్​.. పటియాలాలోని పోలింగ్​ బూత్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Punjab Assembly election
అమృత్​సర్​లో ఓటు వేసి వస్తున్న వృద్ధురాలు

బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ సోదరి, మోగా స్థానం నుంచి కాంగ్రెస్​ తరఫున బరిలో నిలిచిన మాళవిక సూద్​.. మోగాలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలోని బూత్​లో ఓటు వేశారు.

Punjab Assembly election
ఓటు హక్కు వినియోగించుకున్న మాళవిక సూద్​
Punjab Assembly election
ఓటర్ల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలిస్తున్న అధికారిని

పోలింగ్​ కేంద్రం వద్ద సిద్ధూ, మజితియా వ్యంగ్యాస్త్రాలు

అమృత్​సర్​ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్​ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ, ఆయన ప్రత్యర్థి సిరోమణి అకాలి దళ్​ నేత బిక్రమ్​ సింగ్​ మజితియా.. ఓటింగ్​ కేంద్రం వద్ద ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కాసేపు మాట్లాడుకున్నారు. నవ్వుకుంటూనే ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు.

Punjab Assembly election
ఓటింగ్​ కేంద్రం వద్ద మహిళా ఓటర్లు
Punjab Assembly election
ఓటు వేసిన వృద్ధురాలు
Punjab Assembly election
పోలింగ్​ కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు
Punjab Assembly election
గుర్తింపు కార్డును చూపుతున్న ఓటర్లు

ఇదీ చూడండి: 'ఉగ్రవాదులంటే ఆ పార్టీలకు జాలి.. కేసుల ఎత్తివేతకు యత్నం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.