ETV Bharat / bharat

పంజాబ్ ఎన్నికలు.. ఆమ్ ఆద్మీ వైపు వీస్తున్న గాలి! - పంజాబ్ ఎన్నికల్లో ఆప్ పాత్ర

Punjab 2022 poll battle: అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీపై వ్యతిరేకత, శిరోమణి అకాలీద‌ళ్‌ కోలుకోకకపోవడం.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. 2017 నుంచి క్రమంగా పుంజుకుంటున్న ఆప్.. ఈసారి ఎన్నిక‌ల్లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కొన్ని సంస్థల ముందస్తు సర్వేలు సైతం గాలి.. ఆమ్‌ఆద్మీ వైపే వీస్తోందని అంచనా వేశాయి.

Punjab 2022 poll battle
పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ గాలి?
author img

By

Published : Jan 11, 2022, 11:22 PM IST

Punjab 2022 poll battle: ఆమ్ ఆద్మీ పార్టీ ఓ సంచ‌ల‌నాల పార్టీగా పేరుపొందింది. దిల్లీలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వ‌చ్చిన ఆప్‌.. త‌ర్వాత భాజపాతో గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ, అధికారం నిలబెట్టుకుంది. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ, తర్వాత కొద్ది నెలలకే జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫ‌లితాల‌ు సాధించి, రెండోసారి అధికారం చేపట్టింది. దిల్లీలో పాగా వేసినప్పటి నుంచే పక్కనున్న పంజాబ్‌పై గురిపెట్టిన ఆమ్ ఆద్మీ.. క్రమంగా అక్కడ బలపడుతూ వచ్చింది. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో చ‌రిత్ర సృష్టిస్తుందని భావించినప్పటికీ నిరాశపర్చింది. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లు ఉండగా 2017 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ 77 సీట్లు గెల్చి అధికారం చేపట్టింది. ఆమ్‌ఆద్మీ 20చోట్ల విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. శిరోమణి అకాలీద‌ళ్‌ 15 సీట్లు మాత్రమే గెలిచి మూడోస్థానానికి పడిపోయింది. అయితే 2017 ఎన్నికల తర్వాత పంజాబ్‌ ప్రజలు తమపై ఆసక్తిగా ఉన్నారనే విషయాన్ని ఆమ్‌ ఆద్మీ గ్రహించింది. ఫలితంగా అక్కడ పార్టీ నిర్మాణంపై ఆప్‌ దృష్టిసారించింది. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది.

బలపడుతూ వచ్చిన శిరోమణి అకాలీదళ్​...

పంజాబ్‌లో శిరోమ‌ణి అకాలీద‌ళ్ సంస్థాగ‌తంగా బలహీనపడుతూ వచ్చింది. భాజపాతో పొత్తు ముగిసిన తర్వాత ఆ పార్టీ ఎవ‌రితో పోరాడుతుందో అర్థం కాకుండా అయింది. రైతు చ‌ట్టాల‌ను వ్యతిరేకించి భాజపాతో తెగదెంపులు చేసుకున్నప్పటికీ రైతుల‌కు ద‌గ్గర కాలేక‌పోయింది. అటు భాజపాకూ దూరమైంది. ఫలితంగా ఈసారి ఎన్నిక‌ల్లో అకాలీద‌ళ్ ప్రభావం పెద్దగా ఉండ‌క‌పోవ‌చ్చనని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అయితే..ఆమ్‌ఆద్మీ ప‌రిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఐదేళ్ల క్రితం 20 మంది ఎమ్మెల్యేల‌తో పంజాబ్ అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆప్‌ను అధికార కాంగ్రెస్ వ‌ద‌ల్లేదు. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లారు. అయినా క్షేత్రస్థాయిలో పార్టీపై ఓట‌ర్లకు న‌మ్మకం క‌లిగించేలా ప్రయ‌త్నించింది. క్రమంగా బలపడుతూ వచ్చింది. ఇటీవలి చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. మొత్తం 14 చోట్ల గెల్చి అతిపెద్ద పార్టీగా అవతరించింది. భాజపా 12, కాంగ్రెస్ 8, అకాలీదళ్ ఒక్కచోటే గెలిచాయి.

పుంజుకోలేకపోయిన భాజపా..

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. పంజాబ్‌లో చెప్పుకోదగిన స్థాయిలో పుంజుకోలేదు. ఒక వేళ కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చిన మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌తో పొత్తు పెట్టుకొంటే కమలనాథులు మెరుగైన ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చు. కానీ అధికారం అందుకుంటుంద‌ని చెప్పలేని ప‌రిస్థితి. అమ‌రీంద‌ర్ సింగ్ బ‌య‌ట‌కు వెళ్లడం వల్ల కాంగ్రెస్‌కు కచ్చితంగా కొంతమేర నష్టం జరుగుతుందని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ఈ వ్యతిరేక‌త ఎక్కువ‌గా ఆప్‌కు క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉందని అంటున్నారు. పంజాబ్‌లో ఈసారి ఎన్నికలు బహుముఖ పోరుకు తెరతీశాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ, భాజపా-అమరీందర్‌ కూటమి, అకాలీద‌ళ్‌-బీఎస్​పీ జట్టు కట్టడం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతు సంఘాలు రెండు పార్టీలను ఏర్పాటు చేయడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు పంజాబ్ ఎన్నికలపై ఎన్​ఆర్​ఐల ప్రభావం అధికంగా ఉంటుంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం నేపథ్యంలో ఈసారి ఎన్​ఆర్​ఐల సానుభూతి రైతులకు ఉంటుందని ఓ అంచనా ఉంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయడంపై రైతు సంఘాల మధ్య అనైక్యత, పోటీలో ఉన్న బహుళ పార్టీల వల్ల వారు వేచిచూసే ధోరణి అవలంబించవచ్చని తెలుస్తోంది. దిల్లీలో ఆమ్‌ఆద్మీ చేపట్టిన అనేక కార్యక్రమాల పట్ల ఆకర్షితులైతే పంజాబ్‌ ఎన్​ఆర్ఐలు ఆ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇదీ చూడండి: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మాయావతి దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.