మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. కాత్రజ్-ముంబయి రోడ్లో నవలే బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది.
"పెయింట్ పరిశ్రమలో వాడే తిన్నర్తో ముంబయి వైపు వెళ్తున్న ఓ ట్యాంకర్ శుక్రవారం సాయంత్రం.. ఓవర్టేక్ చేసే క్రమంలో ఆటోను (7 సీటర్) ఢీకొట్టింది. వెంటనే ఆటో బోల్తా కొట్టి రోడ్డు మీద నుంచి పక్కకు దొర్లుకుంటూ వెళ్లింది. అనంతరం మరో ఖాళీ కంటెయినర్ కూడా ట్యాంకర్ ఢీకొట్టింది." అని పోలీసులు తెలిపారు.
మరణించినవారిలో ఇద్దరు ఆటోలో ఉండగా, మరొకరు పాదచారి అయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: ఘోర రోడ్డుప్రమాదం- ఒకే కుటుంబంలోని 8 మంది మృతి