మహారాష్ట్రలో కరోనా విభృంభణ మళ్లీ మొదలైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పుణెలో ఫిబ్రవరి 28తో ముగియనున్న రాత్రి కర్ఫ్యూను మార్చి 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు నగర మేయర్ మురళీధర్ మోహోర్. పాఠశాలలను సైతం మార్చి 14 వరకు మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఈ సమయంలో అత్యవసర సేవలకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
హింగోలీ జిల్లాలో రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 1 నుంచి 7 వరకు కర్ఫ్యూను విధించాలని నిర్ణయించారు. కర్ఫ్యూ సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, మెడికల్ షాప్స్ తప్ప మిగతా కార్యాలయాలు మూసివేయాలని ఆదేశించారు అధికారులు.
మహారాష్ట్రలో వరుసగా నాలుగోరోజూ 8వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 21,46,777 కరోనా కేసులు నమోదయ్యాయి. 52, 092 మంది వైరస్ బారిన పడి మరణించారు.
ఇదీ చదవండి : దేశంలో మరో 16,752 మందికి కరోనా