ETV Bharat / bharat

Pulwama Encounter: పుల్వామాలో ఎన్​కౌంటర్.. జైషే కమాండర్ హతం - పుల్వామాలో భారీ ఎన్​కౌంటర్

encounter
ఎన్​కౌంటర్​
author img

By

Published : Dec 1, 2021, 9:21 AM IST

Updated : Dec 1, 2021, 10:19 AM IST

09:16 December 01

Pulwama Encounter: పుల్వామాలో ఎన్​కౌంటర్.. జైషే కమాండర్ హతం

Pulwama Encounter: జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు.

Jaish Commander Killed: మృతుల్లో జైష్​-ఏ-మహమ్మద్(జేఈహెచ్​) ఉగ్రవాదసంస్థకు చెందిన కీలక కమాండర్ యాసిర్​ పరే​ ఉన్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్​కుమార్ వెల్లడించారు. ఐఈడీ అమర్చడంలో యాసిర్ సిద్ధహస్తుడన్నారు. అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో వీరికి ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు. ​

పుల్వామా జిల్లాలోని క్వాస్​బయార్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు.. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్లు ఓ అధికార ప్రతినిధి తెలిపారు.

ఎన్​కౌంటర్ జరిగిన ప్రాంతంలో మరింత భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Last Updated : Dec 1, 2021, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.