దేశవ్యాప్తంగా పోలియో టీకాల పంపిణీ ఆదివారం నుంచి జరగనుంది. అయిదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఫిబ్రవరి 2 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. శనివారమే పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓ చిన్నారికి స్వయంగా చుక్కలు వేశారు.
17 కోట్ల మందికిపైగా..
కరోనా నిబంధనలను అనుసరించి.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీకాల పంపిణీ జరగనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 17 కోట్ల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.
టీకాల పంపిణీ జనవరి 16న ప్రారంభం కావాల్సి ఉన్నా అదే రోజు కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఆరంభం కావడంతో ఈ కార్యక్రమ తేదీని సవరించారు.
ఇదీ చూడండి: పోలియో చుక్కల పంపిణీని ప్రారంభించిన రాష్ట్రపతి