Psycho Killers Shot In Bihar : బిహార్ బెగుసరాయ్‌లో ఇద్దరు సైకో కిల్లర్లు వీరంగం సృష్టించారు. తొమ్మిది మందిని తుపాకులతో కాల్చారు. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఎనిమిది మందిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నాలుగైదు ప్రాంతాలు తిరుగుతూ కనిపించిన వారిపై కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. ఇంకా నిందితులని గుర్తించలేదని తెలిపారు. మృతుడిని చందన్ కుమార్ (30) గా గుర్తించారు.
"ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై తిరుగుతూ కనిపించిన వాళ్లపై కాల్పులకు దిగారు. వారిద్దరూ సైకో కిల్లర్లుగా అనిపిస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులను అలర్ట్ చేశాం. వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నాం" అని బెగుసారై జిల్లా ఎస్పీ యోగేంద్ర కుమార్ తెలిపారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, ఇంకా కొందరిని మెరుగైన వైద్య సేవల కోసం పట్న తరలించామని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని.. త్వరలోనే అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: 'అరవింద్ అడ్వర్టైజ్‌మెంట్ పార్టీ'.. ఆప్‌పై కాంగ్రెస్ విమర్శలు
గిన్నెను తాకిందని దళిత దివ్యాంగురాలిపై వేడి నీరు పోసిన టీచర్