ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన బిమల్ కిశోర్ అతిచిన్న చరఖా రూపొందించి లిమ్కా రికార్డుల్లో స్థానం సంపాదించారు. 35 ఏళ్ల కిశోర్ మూడు రోజుల్లో 2.5 సెంటిమీటర్లు ఉండే చరఖాను రూపొందించారు. సాధించాలన్న ఆయన తపనకు అంగవైకల్యం అడ్డు రాలేదు.
రికార్డు బద్దలు కొట్టాలని..
చరఖా వెనుక కథ గురించి ఈటీవీ భారత్ ఆరా తీసింది. మూడు సెంటీమీటర్లు ఉన్న చరఖాను ఎవరో తయారు చేసినట్లు తన స్నేహితుడు చెప్పారని.. ఆ రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంతో ఈ బుల్లి చరఖాను చేశానన్నారు కిశోర్. లిమ్కా రికార్డు సాధిస్తానని తాను ఊహించలేదన్నారు. వీటితో పాటు వరల్డ్ కప్, క్రికెట్ బ్యాట్, హాకీ స్టిక్ వంటి సూక్ష్మ ఆకృతులు కూడా రూపొందించారు.
ఇదీ చదవండి : రికార్డ్: కళ్లు మూసుకొని పియానో వాయించాడు