Prostitution racket arrested: వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో ఓ టీవీ నటి సహా మరో ఇద్దరు మహిళలను కాపాడారు. అరెస్టైన వ్యక్తిని హైదరాబాద్‌కు చెందిన హఫీజ్ సయ్యద్ బిలాల్‌గా గుర్తించారు.
రాష్ట్ర రాజధాని పనాజీ సమీపంలోని సంగోల్దా గ్రామంలో వ్యభిచార రాకెట్ నడుస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇది నడుపుతున్న బిలాల్‌ను పట్టుకునేందుకు వలపన్నారు. అతనే అని వివరాలు ధ్రువీకరించుకొని, రూ.50 వేలకు ముగ్గురు అమ్మాయిలను హోటల్‌కు తీసుకురావాలని సూచించారు. వారిని నమ్మిన బిలాల్ మార్చి 17న ముగ్గురు అమ్మాయిలను హోటల్‌కు తీసుకురాగా అక్కడే అరెస్ట్ చేశారు.
విచారణ సందర్భంగా సెక్స్ రాకెట్ నడిపిస్తున్నట్లు బిలాల్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. పెద్ద పెద్ద హోటళ్లకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్లు చెప్పాడన్నారు. ముగ్గురు మహిళలు హైదరాబాద్, ఝార్ఖండ్, మహారాష్ట్రలోని ఠాణె జిల్లాకు చెందిన వారిగా చెప్పారు. వారి వయసు సుమారుగా 30 నుంచి 37 ఏళ్లు ఉంటుందన్నారు.
మానవ అక్రమ రవాణా, వ్యభిచారం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: prostitution gang arrest : వ్యభిచార కూపంలోకి బాలిక.. ముఠా అరెస్టు