ETV Bharat / bharat

మసాజ్ సెంటర్ల ముసుగులో సెక్స్ రాకెట్- 151 చోట్ల పోలీస్​ రైడ్​ - చెన్నై న్యూస్​

చెన్నైలోని 151 మసాజ్, స్పా సెంటర్లపై పోలీసులు రైడ్ చేశారు. కొంతమంది సెక్స్​ రాకెట్ నడిపిస్తున్నారనే పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. పలువురిని అరెస్టు చేశారు.

చైన్నై సెక్స్ రాకెట్, Prostitution in Chennai
మసాజ్ సెంటర్ల ముసుగులో సెక్స్​ రాకెట్​..
author img

By

Published : Nov 23, 2021, 10:12 AM IST

తమిళనాడు రాజధాని చెన్నైలో మసాజ్ సెంటర్ల ముసుగులో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నారు. దీనిపై కచ్చితమైన సమాచారం అందిన పోలీసులు 151 మసాజ్, స్పా సెంటర్లపై రైడ్​ చేశారు. ఈ వ్యభిచార దందాతో సంబంధమున్న పలువురిని అరెస్టు చేశారు.

చెన్నైలో మసాజ్ సెంటర్ల నిర్వహణకు చాలా మంది అధికారిక అనుమతులు తీసుకుంటున్నారు. అయితే కొంతమంది అక్రమంగా ఈ కేంద్రాల్లో వ్యభిచారం నడిపిస్తున్నారు. ఆదివారం రాత్రి తియాగారాయ నగర్​లో 20 , కిల్​పాక్​లోని 6 మసాజ్ సెంటరల్లో డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్​ నేతృత్వంలో పోలీసులు రైడ్ చేశారు.

వ్యభిచార నియంత్రణ విభాగంలో పనిచేస్తున్న పోలీస్​ ఇన్​స్పెక్టర్లు శరవణన్​, శామ్​ విన్సెట్​ ఇళ్లపై కొద్ది రోజుల క్రితమే అవినీతి నిరోధక పోలీసులు దాడులు చేశారు. వారికి సెక్స్ రాకెట్ ముఠాతో సంబంధాలున్నాయని ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.

ఇదీ చదవండి: భార్యకు ప్రేమతో.. అచ్చం తాజ్​మహల్ లాంటి ఇల్లు కానుక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.