a Bodyless Head Case Malakpet : హైదరాబాద్‌లో జరిగిన మహిళ హత్య సంచలనం సృష్టించింది. ఈ నెల 17న మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మూసీనది సమీపంలో మొండెం లేని మహిళ తల దొరికిన కేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా తలను అక్కడ పడేసిన వ్యక్తిని చంద్రమోహన్‌గా గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని హైదరాబాద్ ఆగ్నేయ మండలం డీసీపీ రూపేశ్ వెల్లడించారు.
ఎర్రం అనురాధ రెడ్డిని అతికిరాతకంగా హత్య చేసి.. తల, మొండెం వేరు చేశాడని డీసీపీ రూపేశ్ వెల్లడించారు. చంద్రమోహన్‌కు.. అనురాధకు పదేళ్లుగా పరిచయం ఉందని... అప్పటి నుంచి తరచూ ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్నారని తెలిపారు. రెండేళ్ల నుంచి చైతన్యపురిలోని అతడి నివాసంలో ఆమె అద్దెకు ఉంటున్నారని చెప్పారు. అన్‌లైన్‌లో ట్రేడింగ్ చేసే నిందితుడికి దశల వారీగా మృతురాలు డబ్బులు ఇచ్చారని వివరించారు.
డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో : డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని డీసీపీ రూపేశ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 12న ఇదే విషయంలో జరిగిన ఘర్షణలో.. అనురాధను ఆమె ఇంట్లోనే చంద్రమోహన్ హత్య చేశాడని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని స్టోన్ కట్టర్, చికెన్ షాపులో ఉపయోగించే కత్తులతో ముక్కలు చేశాడని వివరించారు. కొన్ని భాగాలను ఫ్రిజ్‌లో.. మరి కొన్ని భాగాలను డస్ట్‌బిన్ కవర్లో దాచాడని రూపేశ్ చెప్పారు.
శరీర భాగాలను మాయం చేసేందుకు : ఇంట్లో దుర్వాసన రాకుండా.. చంద్రమోహన్ కర్పూరం ఇతర రసాయనాలు వినియోగించాడని డీసీపీ రూపేశ్ తెలిపారు. ఈ నెల 17న తలను తీసుకువచ్చి మలక్‌పేట పరిధిలోని మూసీనది సమీపంలో వదిలివెళ్లాడని వివరించారు. అనురాధ బతికే ఉన్నట్లు నమ్మించడానికి ఆమె చరవాణిని కూడా నిందితుడు ఉపయోగిస్తున్నాడని పేర్కొన్నారు. హత్య చేసిన తర్వాత శరీర భాగాలను మాయం చేసేందుకు పలు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూశాడన్నారు.
చంద్రమోహన్‌ను హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి ఘటన జరిగిన విధానాన్ని తెలుసుకున్నామని డీసీపీ కరూపేశ్ వివరించారు. ఈ హత్యపై ఎలాంటి ఫిర్యాదు, మిస్సింగ్ కేసు లేకున్నా.. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కేసును ఛేదించినట్లు తెలిపారు. ఈ హత్య రాచకొండ కమిషనరేట్ పరిధి చైతన్యపురిలో జరగడం వల్ల.. ఆ కమిషనరేట్‌కు బదిలీ చేస్తామని డీసీపీ రూపేశ్ వెల్లడించారు.
"మలక్‌పేట పరిధిలో హత్య ఘటనపై 8 బృందాల ద్వారా దర్యాప్తు చేశాం. నేరస్థుడు కిరాతకంగా మృతదేహం నుంచి తల వేరు చేసి మూసీ వద్ద పారేశాడు. మృతురాలిని గుర్తించడానికి అదృశ్యం కేసులన్నీ పరిశీలించాం. ఘటనకు ముందు నుంచి సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించాం. నిన్న అనుమానాస్పదంగా వ్యక్తి సంచరించినట్లు గుర్తించాం. నిందితుడు ఉన్న ప్రాంతానికి వెళ్లి మిగతా శరీర భాగాలు స్వాధీనం చేసుకున్నాం." - రూపేశ్, హైదరాబాద్ ఆగ్నేయ మండలం డీసీపీ
ఇవీ చదవండి : Teen Crashes Into White House With Truck In America : 'బైడెన్‌ను చంపేందుకు.. 6 నెలలు ప్లాన్ చేశా'
అప్పుడు నెహ్రూ.. ఇప్పుడు మోదీ.. పార్లమెంట్లో పెట్టే 'సెంగోల్' కథేంటో తెలుసా?