ETV Bharat / bharat

ఇంజిన్​ కవర్​ లేకుండానే విమానం టేకాఫ్​.. లక్కీగా... - DGCA news

Alliance air flight: అలయన్స్​ ఎయిర్ విమానం ఇంజిన్​ కవర్ లేకుండానే ముంబయి ఎయిర్​పోర్టు నుంచి టేకాఫ్ అయింది. పేలవ నిర్వహణ వల్లే ఇలాంటివి జరుగుతుంటాయని నిపుణులు మండిపడ్డారు. అయితే విమానం భుజ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్​ అయింది.

alliance-air-flight
ఇంజిన్ కవర్ లేకుండానే ఎగిరిన విమానం
author img

By

Published : Feb 9, 2022, 3:07 PM IST

Alliance air flight: ఎయిర్​ ఇండియా ఉపసంస్థ అలయన్స్​ ఎయిర్​కు చెందిన ఓ విమానం ఇంజిన్​ కవర్​ లేకుండానే టేకాఫ్​ అయింది. బుధవారం ఉదయం ముంబయి విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే రన్​వేపై ఇంజిన్ కవర్​ను గుర్తించినట్లు ఎయిర్​పోర్టు వర్గాలు తెలిపాయి. విమానం ముంబయి నుంచి గుజరాత్​లోని భుజ్​కు బయల్దేరుతుండగా రన్​వేపైనే ఇంజిన్ కవర్ ఊడిపోయిందని, అయినప్పటికీ విమానం యథావిధిగా టేకాఫ్​ అయిందని పేర్కొన్నాయి.

విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్​ కవర్​ పడిపోయిన విషయాన్ని ముంబయి ఎయిర్​ ట్రాఫిక్ కంట్రోల్​ తెలియజేసిందని సంబంధిత అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని డైరెక్టర్ జనరల్​ ఆఫ్ సివిల్​ ఏవియేషన్​(DGCA) ఆదేశించింది.

నిర్వహణ లోపం వల్లే..

పేలవ నిర్వహణ వల్లే ఇంజిన్​ కవర్ ఊడిపోయి ఉంటుందని విమాన నిపుణుడు కెప్టెన్ అమిత్ సింగ్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా మెయింటెనెన్స్ కార్యకలాపాల​ అనంతరం లాచెస్​ భద్రంగా లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయని, కానీ విమానం టేకాఫ్​ అయ్యే సమయంలో ఇలా జరగడం కచ్చితంగా నిర్వహణ లోపమే అన్నారు.

ఇదీ చదవండి: 'బికినీ, జీన్స్​, హిజాబ్​.. అంతా మా ఇష్టం! మధ్యలో మీరెవరు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.