ETV Bharat / bharat

భాజపాకు కొరకరాని కొయ్యగా వరుణ్- ప్రియాంక మాస్టర్ ప్లాన్!​ - uttar pradesh congress news

ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలహీనపడినప్పటికీ భాజపాపై విమర్శలు గుప్పిస్తూ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతున్నారు ప్రియాంక గాంధీ. మరోవైపు ఆమె సోదరుడు, భాజపా ఎంపీ వరుణ్​ గాంధీ సొంత పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో యోగి సర్కార్​కు 'డబుల్ ఛాలెంజ్'​ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కమలం పార్టీకి కొరకరానికి కొయ్యగా మారిన వరుణ్.. సోదరి ప్రియాంకతో కలిసి భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించుతారా?

Priyanka expects Varun Gandhi to turn a 'thorn in the flesh' for the BJP
భాజపాకు కొరకరాని కొయ్యగా వరుణ్​- యూపీలో ప్రియాంక మాస్టర్ ప్లాన్​
author img

By

Published : Nov 5, 2021, 4:38 PM IST

పీలీభీత్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా ఎంపీ, మేనకా గాంధీ కుమారుడు వరుణ్​ గాంధీ(varun gandhi news) గతకొద్దికాలంగా ఉత్తర్​ప్రదేశ్​లో సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. క్లిష్ట సమయాల్లో పార్టీ నిర్ణయాలపై బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో(UP election 2022 ) యోగి సర్కార్​కు వరుణ్​ గాంధీ తీరు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో తన సోదరుడు వరుణ్​ గాంధీని తిరిగి కాంగ్రెస్​లోకి తీసుకురావాలని ప్రియాంక గాంధీ(Priyanka Gandhi news) ప్రయత్నిస్తున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది.

ప్రియాంక గాంధీకి సోదరుడు వరుణ్​తో(varun gandhi latest news) ఉన్న అనుబంధం, ఆయనపై ఉన్న నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందని గాంధీ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. పాత విషయాలన్నీ మరచిపోయి.. వరుణ్​ తిరిగి సొంతగూటికి రావాలని ఆమె కోరుకుంటున్నట్లు పేర్కొన్నాయి.

వరుణ్​ గాంధీ దారితప్పారని, కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఓటు వేయొద్దని ప్రియాంక గతంలో ప్రచారం చేశారు(priyanka gandhi latest news). కుటుంబంలో ఒకరు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు వారిని సరైన దారిలో నడిపించడం పెద్దల బాధ్యత అని వ్యాఖ్యానించారు.

భాజపాపై వరుణ్ ఫైర్..​

యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వంపై వరుణ్​ కొద్దికాలంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు(varun gandhi bjp). రైతులపై దాడులు, అవినీతి కేసుల విషయంలో అవసరమైతే తానే నేరుగా కోర్టును ఆశ్రయిస్తానని చెబుతున్నారు. ఓ ఘటనలో కిసాన్ మండీ అధికారికి వరుణ్​ వార్నింగ్ ఇచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో యూపీలో భాజపాకు(UP bjp news) ఒకేసారి రెండు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓవైపు యోగి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ప్రియాంక గాంధీ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు సొంత పార్టీ నిర్ణయాలను వరుణ్ గాంధీ తప్పుబడుతుండటం భాజపాను ఇరకాటంలో పడేస్తోంది.

భాజపా తనను నిర్లక్ష్యం చేస్తోందని వరుణ్​ గాంధీ తీవ్ర అసహనంతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనతో పాటు తన తల్లి మేనకా గాంధీని భాజపా జాతీయ కార్యవర్గం నుంచి తప్పించాక వరుణ్​కు పార్టీపై కోపం మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

లఖింపుర్ ఖేరీ ఘటన తర్వాత ప్రతిపక్షాలతో గొంతు కలిపారు వరుణ్​(varun gandhi on lakhimpur kheri). యూపీ ప్రభుత్వం చెరకు కనీస మద్దతు ధరను రూ.250 నుంచి రూ.350కి పెంచిన తర్వాత.. ఆ ధరను రూ.400గా నిర్ణయించాలని యోగి సర్కార్​కు స్వయంగా లేఖ రాశారు. వెంటనే ప్రతిపక్షాలు కూడా చెరకు ధరను రూ.400కు పెంచాలని డిమాండ్ చేశాయి.

లఖింపుర్ హింస(varun gandhi on lakhimpur) అనంతరం ప్రతిపక్షల్లానే కేంద్రమంత్రి అజయ్​మిశ్రా, ఆయన కుమారుడిని వరుణ్ నిందించారు. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతలకు కూడా మద్దతు ప్రకటించారు. ఇలా ప్రతిసారీ పార్టీని ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తున్న వరుణ్​ తీరు భాజపాకు ఇబ్బందిగా మారింది.

వరుణ్ గాంధీ త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతారని, ప్రియాంక గాంధీతో(priyanka gandhi uttar pradesh) టచ్​లో ఉన్నారనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపాకు ఇది ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: కేదార్​నాథ్​లో మోదీ ప్రత్యేక పూజలు- ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.