Uniform Civil Code Bill 2020 Rajya Sabha : భాజపా కీలక అజెండాల్లో ఒకటైన ఉమ్మడి పౌర స్మృతి అంశం.. ప్రైవేటు మెంబర్ బిల్లు రూపంలో పార్లమెంటు ముందుకు వచ్చింది. రాజ్యసభలో భాజపా సభ్యుడు కిరోడి లాల్ మీనా శుక్రవారం.. ప్రైవేటుగా ఉమ్మడి పౌర స్మృతి 2020 బిల్లును ప్రవేశపెట్టారు. అయితే.. ఈ బిల్లును సభ ముందుకు తీసుకురావడాన్ని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఎంసీ పార్టీలకు చెందిన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈ బిల్లు నాశనం చేస్తుందని విమర్శించారు.
బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్.. బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. 63 మంది అనుకూలంగా ఓటు వేయగా.. మరో 23 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. ఫలితంగా ఉమ్మడి పౌర స్మృతి బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది.
ఇదీ చదవండి: 'ఆ కొలీజియం సమావేశ వివరాలు ఇవ్వలేం'.. RTI పిటిషన్ను కొట్టేసిన సుప్రీం