పరీక్షల సమయంలో కలిగే ఒత్తిడి, భయం, ఆందోళనలను జయించేందుకు విద్యార్థులు ఏం చేయాలో చెబుతూ 2018లో 'ఎగ్జామ్ వారియర్స్' అనే పుస్తకాన్ని రాశారు ప్రధాని నరేంద్ర మోదీ. దానికి సంబంధించిన అప్డేటెడ్ వర్షన్(తాజా సంచిక) ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రకటించింది.
ఈ తాజా సంచికలో తరగతి లోపల, వెలుపల విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలున్నాయని పబ్లిషర్స్ తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు తనను తాను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలిపే సూత్రాలతో పాటు, తోటి విద్యార్థులతో పోటీ పడే తత్వాన్ని అలవరచుకునే విధానాలు ఉన్నాయని పేర్కొన్నారు. వీటితో పాటు సమయపాలను అలవరచుకోవడం, సాంకేతికతను ఉపయోగించడం, లక్ష్యాన్ని నిర్థేశించుకోవడానికి తగిన మార్గదర్శాకాలు విద్యార్థులకు ఈ అప్డేటెడ్ వర్షన్ పుస్తకంలో ఉన్నాయని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు తగిన సూచనలు ఇందులో ఉన్నాయని తెలిపారు.
విద్యార్థులు విద్యను ప్రభావవంతంగా నేర్చుకోవడానికి ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన అనుభవసారాన్ని ఈ సంచిక ద్వారా ప్రధాని మోదీ అందించారని తెలిపింది.
ఇదీ చూడండి: 'మోదీ పుస్తకాన్ని.. రాహుల్కు అందజేస్తా'