బంగాల్, అసోం రాష్ట్రాల ప్రజలు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. శనివారం ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న మోదీ.. ఒకరోజు ముందు ట్వీట్ చేశారు.
బంగాల్లోని ఖరగ్పుర్, అసోంలోని చబువాల్లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొననున్నారు. తన ప్రసంగాల్లో భాజపా అభివృద్ధి అజెండా గురించి విశదీకరిస్తానని పేర్కొన్నారు.
''మార్చి 20న ఖరగ్పుర్, చబువాల్లో ఎన్నికల ర్యాలీలకు హాజరవుతున్నా. నా ప్రసంగాల్లో భాజపా అభివృద్ధి అజెండా గురించి వివరిస్తా. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏనే గెలవాలని రెండు రాష్ట్రాల ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు స్పష్టమైంది.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇప్పటికే ఈ గురువారం అసోంలోని కరీంగంజ్, బంగాల్లోని పురులియాలో ప్రచారం నిర్వహించారు మోదీ.
అసోంలో తిరిగి గద్దెనెక్కాలని భావిస్తున్న భాజపా.. బంగాల్లో తొలిసారి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది.
294 స్థానాలున్న బంగాల్ అసెంబ్లీకి మార్చి 27- ఏప్రిల్ 29 మధ్య 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అసోంలోని 126 నియోజకవర్గాలకు 3 దశల్లో పోలింగ్ జరగనుంది.
మే 2న ఫలితాలు వెల్లడిస్తారు.
ఇదీ చూడండి: 'కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు నిర్లక్ష్యం'