ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం దిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ కేంద్రంలో ప్రారంభమైంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షత వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, రాష్ట్రాల అధ్యక్షులు, వివిధ మోర్చాల జాతీయ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై నేతలు చర్చించనున్నారు. ఎన్నికలకు పార్టీ వ్యూహం ఖరారు చేసే అవకాశం ఉంది. అంతేకాక సాగు చట్టాలు, కరోనా వేళ చేపట్టిన కార్యక్రమాలపైనా చర్చించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : నేడు భాజపా జాతీయ కార్యవర్గం భేటీ.. మోదీ హాజరు!