Priest gets life sentence: అత్యాచారం కేసులో కీలక తీర్పు వెలువరించింది మహారాష్ట్ర, ముంబయిలోని పోక్సో ప్రత్యేక కోర్టు. 13ఏళ్ల బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ చర్చి ఫాదర్కు జీవిత ఖైదు విధించింది.
2015లో ఓ చర్చి ఫాదర్ జాన్సన్ లారెన్స్.. 13 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2015, డిసెంబర్లో ఫాదర్ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు.
ఈ కేసును బుధవారం ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. చిన్నారుల లైగింక వేధింపుల నిరోధక చట్టం(పోక్సో)లోని సెక్షన్ 6, 12 ప్రకారం దోషిగా తేల్చారు న్యాయమూర్తి సీమా జాధవ్. జాన్సన్ లారెన్స్కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఇదీ చూడండి: