భారత మాజీ ప్రధాని, భాజపా అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా అనేక మంది ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు నివాళులు అర్పించారు. దిల్లీలోని వాజ్‌పేయీ స్మారకం 'సదైవ్ అటల్'కు తరలివెళ్లి.. ఆ మహానేత సేవలను స్మరించుకున్నారు. అంతకుముందు వాజ్‌పేయీ స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు.
![atal bihari vajpayee tribute](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16113260_1.jpg)
![atal bihari vajpayee tribute](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16113260_4.jpg)
![atal bihari vajpayee tribute](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16113260_7.jpg)
![atal bihari vajpayee tribute](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16113260_8.jpg)
1990లో భాజపా అధికారంలోకి రావడంలో వాజ్‌పేయీ కీలక పాత్ర పోషించారు. వాజ్‌పేయీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్(ఎన్డీఏ) ప్రభుత్వం 1998-2004 వరకు అధికారంలో ఉంది. భాజపా నుంచి ప్రధాని అయిన తొలి నేతగా గుర్తింపు పొందారు వాజ్‌పేయీ. ఆయన మూడు సార్లు ప్రధానిగా సేవలందించారు. 1996లో ప్రధాని అయినప్పటికీ ఆయన ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. మళ్లీ 1998,1999లో ప్రధానిగా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ 2018, ఆగస్టు 16న 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయనకు 2015లో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
![atal bihari vajpayee tribute](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16113260_9.jpg)
![atal bihari vajpayee tribute](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16113260_11.jpg)
![atal bihari vajpayee tribute](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16113260_13.jpg)
![atal bihari vajpayee tribute](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16113260_10.jpg)
ఇవీ చదవండి: డీఎన్ఏ పరీక్షలతో నేతాజీ మరణం మిస్టరీని ఛేదించండి
కలెక్టర్ హత్య కేసులో ఆ నేతకు జీవితఖైదు, అయినా ఇంట్లోనే కాలక్షేపం