ETV Bharat / bharat

President Murmu Unveiled NTR Commemorative Coin: రాముడు, కృష్ణుడిగా ప్రజల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం

President Murmu Unveiled NTR Commemorative Coin: తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

President Murmu Unveiled NTR Commemorative Coin

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 12:16 PM IST

Updated : Aug 28, 2023, 10:01 PM IST

President Murmu Unveiled NTR Commemorative Coin: రాముడు, కృష్ణుడిగా ప్రజల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Murmu Unveiled NTR Commemorative Coin: నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకుని 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాణెం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు.

మింట్ కాంపౌండ్‌లో తయారైన ఎన్టీఆర్‌ స్మారక నాణెం: హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో ఎన్టీఆర్‌ స్మారక నాణెం తయారైంది. నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. అదే విధంగా నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌తో పనిచేసిన సన్నిహితులను ఆహ్వానించారు.

President Murmu to Unveil NTR Commemorative Coin of Rs 100: ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్.. విడుదల చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Daggubati Purandeswari about on Sr NTR: సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ తనదైన ముద్రవేశారని ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా వంద రూపాయల నాణేన్ని విడుదల చేయడం ఆయనికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్‌ తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు.

ఎన్టీఆర్‌ అంటే తెలియనివారు ఉండరు: మహిళల సంక్షేమానికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారని.. తిరుపతిలో ఏర్పాటు చేసిన మహిళా యూనివర్శిటీయే దానికి నిదర్శనం అన్నారు. ఎన్టీఆర్‌ అంటే తెలియనివారు ఉండరని పురందేశ్వరి పేర్కొన్నారు. సమాజంపై సినిమా ప్రభావం ఎంతో ఉంటుందని అన్నారు. మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలని ఎన్టీఆర్‌ చెప్పారని పురందేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్‌ ఒక తరం హీరో కాదు, అన్ని తరాలకు ఆదర్శ హీరో అని కొనియాడారు.

NTR Centenary Celebrations: 'ఎన్టీఆర్‌లోని క్రమశిక్షణ, లక్ష్య సాధన.. నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి'

Draupadi Murmu Comments on NTR: రాముడు, కృష్ణుడిగా ప్రజల్లో ఎన్టీఆర్‌ చెరగని ముద్ర: భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారకరామారావు ఎంతో ప్రత్యేకమని.. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అన్నారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని కొనియాడారు. ఆ పాత్రలతో ప్రజలలో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని తెలిపారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్‌ తన ప్రత్యేకత చాటుకున్నారని అన్నారు.

భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్‌ ఎంతో ప్రత్యేకం: సామాజిక న్యాయం కోసం ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. భారత చలనచిత్ర రంగం ఉన్నతిలో ఎన్టీఆర్‌ పాత్ర కీలకమని అన్నారు. రాముడు, కృష్ణుడి రూపాలను ప్రజలు ఆయనలో చూసుకున్నారని రాష్ట్రపతి కొనియాడారు. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్‌ ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.

ఎన్టీఆర్ జీవిత విశేషాలతో వీడియో: కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించిన ఎన్టీఆర్‌ స్వయం కృషితో సినీ, రాజకీయ రంగాలపై చెరగని ముద్రవేశారు. రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 22 నిమిషాల నిడివి కలిగిన వీడియోను సభికులు వీక్షించారు...

ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. పాల్గొన్న బాలకృష్ణ సతీమణి, కుమార్తె

Last Updated : Aug 28, 2023, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.