ETV Bharat / bharat

చలిమంట దగ్గర బాలుడి 'ఆట'.. 7 నెలల గర్భిణికి గాయాలు.. అత్తింటివారిపై అనుమానాలు! - దిల్లీ లేటెస్ట్ న్యూస్

చలిమంట వద్ద కూర్చున్న గర్భిణీ సహా ఆమె భర్తకు మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని హుటాహుటిన సఫ్దర్​జంగ్​ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన వారిని హుటాహుటిన సఫ్దర్​జంగ్​ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.

woman set on fire by husband
woman set on fire by husband
author img

By

Published : Jan 9, 2023, 7:43 PM IST

Updated : Jan 9, 2023, 7:53 PM IST

దిల్లీ బవానాలో దారుణం జరిగింది. చలిమంట వద్ద కూర్చున్న గర్భిణీ సహా ఆమె భర్తకు మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని హుటాహుటిన సఫ్దర్​జంగ్​ ఆస్పత్రికి తరలించారు. ఓ బాలుడు మంటల్లో పెయింట్ తిన్నర్​ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే.. భర్త, అత్తమామలు ఆమెను వేధిస్తున్నారని దిల్లీ మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​ స్వాతి మల్వాల్ ఆరోపించారు. బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.

ఇదీ జరిగింది
శుక్రవారం రాత్రి భర్త వీర్​ ప్రతాప్​, ఏడు నెలల గర్భిణి భార్య ఖుష్బూ, ఓ బాలుడు కలిసి చలిమంట వేసుకుని కుర్చున్నారు. మంట ఆరిపోయే సమయంలో పెయింట్​ తిన్నర్​ వేస్తూ ఆరిపోకుండా చూస్తున్నారు. అకస్మాత్తుగా బాలుడు తిన్నర్​ను మొత్తం వేయడం వల్ల భార్యాభర్తలిద్దరికీ మంటలు అంటుకున్నాయి. తీవ్ర గాయాలపాలైన వీరిని హుటాహుటిన సఫ్దర్​జంగ్​ ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. భర్త, అత్తమామలు కలిసి తన సోదరిని వేధిస్తున్నారని.. వారే నిప్పంటించారని బాధితురాలి సోదరుడు ఆరోపించాడు. బాధితురాలి వాంగ్మూలం తీసుకోగా ఆమె ప్రమాదేమనని ధ్రువీకరించిందని పోలీసులు తెలిపారు.

మహిళపై పెట్రోల్ పోసి నిప్పు
ఝార్ఖండ్​ హజారీబాగ్​లో అమానవీయ ఘటన జరిగింది. ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి యత్నించారు నలుగురు దుండగులు. ఇందుకు ఆమె ప్రతిఘటించడం వల్ల పెట్రోల్​ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన హజారీబాగ్​ మెడికల్​ కాలేజీకి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల రిమ్స్​కు తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. నిందితులంతా బాధితురాలి బంధువులేనని పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది
హజారీబాగ్​ జిల్లాలోని ఛార్హీ గ్రామానికి చెందిన 23 ఏళ్ల వివాహిత ఒంటరిగా ఇంట్లో ఉంది. ఆమె నిర్వహిస్తున్న దుకాణానికి వచ్చిన దుండగులు చాక్లెట్లు తీసుకున్నారు. అనంతరం రూ. 10 ఇచ్చి మిగలిన డబ్బులు తర్వాత ఇస్తామనగా.. ఆమె కుదరదని చెప్పింది. ఆ తర్వాత దుకాణం మూసివేసి ఇంటికి రాగా.. వెనుక డోర్​ నుంచి వచ్చిన దుండగులు ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె ప్రతిఘటించడం వల్ల ఆమెను మంచానికి కట్టేసి పెట్రోల్​ పోసి నిప్పంటించారు. ఆమె అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించి.. ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి: 'మతమార్పిళ్లు' చాలా తీవ్రమైన అంశం.. రాజకీయ రంగు పులమొద్దు : సుప్రీం

భజరంగ్​దళ్ కార్యకర్తపై దాడికి యత్నం.. త్రుటిలో తప్పిన ప్రమాదం

Last Updated : Jan 9, 2023, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.