Pregnant Woman Dies in TET Exam Hall Sangareddy : రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పేపర్-1 కూడా పూర్తయింది. అయితే సంగారెడ్డి జిల్లాలో టెట్ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన రాధిక అనే గర్భిణి మృతి చెందింది. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో పరీక్ష రాసేందుకు వచ్చిన ఎనిమిది నెలల గర్భిణి రాధిక.. ఎగ్జామ్ హాల్‌కు వెళ్లే తొందరలో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లింది.
Pregnant Lady Dies in TET Exam Hall Patancheru : ఎగ్జామ్ హాల్‌కు చేరుకున్న కాసేపటికే బీపీ ఎక్కువై ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే గమనించిన ఇన్విజిలేటర్.. ఇతర సిబ్బంది ఆమె కుటుంబానికి సమాచారం అందించారు. రాధికతో పాటు వచ్చిన ఆమె భర్త అరుణ్ వెంటనే ఆమెను పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాధిక మరణంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. ఎనిమిది నెలల గర్భిణి అయినా.. రాత్రింబవళ్లు ఈ పరీక్ష కోసం చాలా కష్టపడి చదివిందని.. తీరా పరీక్ష రాయడానికి వస్తే ఏకంగా ప్రాణాలే పోయాయంటూ ఆమె భర్త కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
'రాధికకు బీపీ ఉంది. ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నప్పుడు తనకు బీపీ ఉందని అక్కడి వైద్యులు చెప్పారు. తను గత మూడు వారాల నుంచి బీపీ ట్యాబ్లెట్స్ వాడుతోంది. ఇవాళ సడెన్‌గా పరీక్షా కేంద్రంలో పడిపోయింది. అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకువచ్చేసరికి తనకు పల్స్ పడిపోయింది. గుండెపోటు వచ్చి ఉంటుందని మేం భావిస్తున్నాం.' - ప్రియదర్శిని, వైద్యురాలు
షుగర్‌తో గుండెపోటు, బెయిన్ స్ట్రోక్‌కు ఛాన్స్.. ఈ సింపుల్ టిప్స్‌తో కంట్రోల్!
టెట్ పరీక్ష హాల్‌టికెట్‌పై హీరోయిన్ అనుపమ ఫొటో!
'నా భార్యకు టెట్ పరీక్ష ఉంటే ఇస్నాపూర్‌కి వచ్చాము. సమయం అవుతుందని తను లోపలికి వెళ్లింది. బీపీ ఎక్కువై.. చెమటలు రావడంతో అక్కడే పడిపోయింది. పాఠశాల స్టాఫ్ చెప్పగానే వెంటనే పటాన్‌చెరు ఆస్పత్రికి తీసుకొచ్చాం. హాస్పిటల్‌కు వస్తుంటే మధ్యలో తన ముక్కు నుంచి రక్తం కారింది. అప్పుడే అనుకున్నా చాలా సీరియస్ అవుతుందని. కానీ ఇలా ప్రాణాలే పోతాయని మాత్రం అనుకోలేదు. ఎన్నో రోజుల నుంచి రాత్రింబవళ్లు కష్టపడుతూ చదివింది పరీక్షకు. గర్భవతి అయినా.. అటు తన ఆరోగ్యం చూసుకుంటూ.. ఇటు తన ఆశయం కోసం కష్టపడింది. కానీ చివరి నిమిషంలో పరీక్ష రాయలేకపోవడం కాదు ఏకంగా ప్రాణాలే కోల్పోయింది. ఇప్పుడు నా బిడ్డలు తల్లిలేని వారయ్యారు.' - అరుణ్, బాధితురాలి భర్త
Telangana TET Exam 2023 : మరోవైపు మిగతా పరీక్షా కేంద్రాల్లో టెట్ పరీక్ష కొనసాగుతోంది. పేపర్-1 పూర్తయి.. పేపర్-2 పరీక్ష మొదలైంది. పేపర్ వన్ కు 2 లక్షల 69 వేల 557 మంది దరఖాస్తు చేయగా.. 1139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ టూ 2 లక్షల 8 వేల 498 రాయనుండగా.. 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదు. ఈనెల 27వ తేదీన టెట్ ఫలితాలను వెల్లడించనున్నట్లు నోటిఫికేషన్లో ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా టెట్ నిర్వహణ.. భారీగా హాజరుశాతం నమోదు
అమ్మ పరీక్ష రాస్తుంటే... పసిపాపను ఆడించిన మహిళా కానిస్టేబుల్