ETV Bharat / bharat

Covid vaccine: ప్రికాషన్​ డోస్​ వ్యవధి కుదింపు.. ఇక వారూ అర్హులే! - కొవిడ్​ వ్యాక్సిన్​

precautions dose time: కరోనా టీకా రెండో డోసు తర్వాత ప్రికాషన్​ డోసు తీసుకునేందుకు ప్రస్తుతం 9 నెలల వరకు వేచి ఉండాలి. అయితే.. ఆ వ్యవధిని తగ్గించే ఆలోచన చేస్తోంది కేంద్రం. సాంకేతిక సలహా బృందం సూచనల మేరకు తుది నిర్ణయం త్వరలోనే వెలువడనుందని అధికారవర్గాలు తెలిపాయి.

Covid vaccine
కరోనా టీకా బూస్టర్​ డోస్​
author img

By

Published : Apr 27, 2022, 8:51 PM IST

precautions dose time: కొవిడ్​-19 టీకా ప్రికాషన్​ డోసు తీసుకునేందుకు వ్యవధిని కుదించాలని కేంద్రం ఆలోచిస్తోంది. రెండో డోసు తర్వాత ప్రికాషన్​ డోసు తీసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న 9 నెలల వ్యవధిని త్వరలోనే ఆరు నెలలకు తగ్గించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రోగనిరోధకతపై.. జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్​టీఏజీఐ) ఏప్రిల్​ 29న సమావేశమై ప్రికాషన్​ డోసు వ్యవధిని తగ్గించాలని ప్రభుత్వానికి ఎన్​టీఏజీఐ ప్రతిపాదించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఎన్​టీఏజీఐ ప్రతిపాదనల మేరకు తుది నిర్ణయం వెలువడనుందని తెలిపాయి.

కొవిడ్​ వ్యాక్సిన్​ రెండు డోసులు వేసిన ఆరు నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గిపోతున్నట్లు ఐసీఎంఆర్​ సహా ఇతర అంతర్జాతీయ పరిశోధన కేంద్రాలు తేల్చాయి. బూస్టర్​ డోస్​ ఇవ్వటం ద్వారా రోగనిరోధక శక్తి స్పందన మెరుగవుతున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడి రెండో డోసు తీసుకున్న వారు ప్రికాషన్​ డోసు తీసుకునేందుకు అర్హులు.

ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్​లైన్​ వర్కర్స్​, 60 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రికాషన్​ డోస్​ను ఈ ఏడాది జనవరి 10న ప్రారంభించింది కేంద్రం. అనారోగ్య సమస్యల క్లాజ్​ను మార్చిలో తొలగించి 60 ఏళ్లు దాటిన వారందరికీ టీకా ఇస్తోంది. ఏప్రిల్​ 10 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్​ డోస్​ ఇవ్వటం ప్రారంభించింది. ఇప్పటి వరకు 18-59 ఏళ్ల వయసు వారికి 5,17,547 ప్రికాషన్​ డోసులు ఇచ్చారు. అలాగే.. 47,36,567 మంది హెల్త్​కేర్​ వర్కర్లు, 74,47,184 మంది ఫ్రంట్​లైన్​ వర్కర్లు, 1,45,45,595 మంది 60 ఏళ్లు పైబడిన వారు బూస్టర్​ డోస్​ తీసుకున్నారు.

ఇదీ చూడండి: Corona Cases In India: స్వల్పంగా పెరిగిన కొవిడ్​ కేసులు

Covid 4th Wave:'జూన్‌ నుంచి కరోనా ఫోర్త్ వేవ్'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.