ETV Bharat / bharat

PK on Congress: అదేం దేవుడిచ్చిన హక్కు కాదు- కాంగ్రెస్​పై పీకే ఫైర్​ - ప్రశాంత్​ కిశోర్​

Prashant Kishor on Congress: మమతా బెనర్జీ తర్వాత.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ కూడా కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. విపక్షాలకు.. కాంగ్రెస్​ నాయకత్వం వహించడం దేవుడిచ్చిన హక్కు ఏం కాదని ట్వీట్​ చేశారు.

Prashant Kishor's Jibe at Rahul Gandhi
కాంగ్రెస్​పై మళ్లీ ప్రశాంత్​ కిశోర్​ ఫైర్​
author img

By

Published : Dec 2, 2021, 3:24 PM IST

Prashant Kishor Congress: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​.. మరోసారి కాంగ్రెస్​ నాయకత్వాన్ని ప్రశ్నించారు. పరోక్షంగా కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీని విమర్శించారు. దేశ రాజకీయాల్లో ప్రతిపక్షంగా ప్రస్తుతం కాంగ్రెస్​ ఉన్న స్థానం కీలకమని.. కానీ ఆ పార్టీ నాయకత్వం సరిగా లేదని ఆరోపించారు. విపక్షాలకు నాయకత్వం వహించడం.. దేవుడు ఇచ్చిన హక్కుగా వారు భావిస్తున్నారని ట్వీట్​ చేశారు.

''బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్​ ఉన్న స్థానం కీలకం. కానీ విపక్షాలకు కాంగ్రెస్​ నాయకత్వం వహించడం దేవుడు ఇచ్చిన హక్కేం కాదు. ముఖ్యంగా.. గత పదేళ్లలో 90 శాతం ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓడిపోయింది.''

- ప్రశాంత్​ కిశోర్​, ఎన్నికల వ్యూహకర్త

విపక్షాలకు ఎవరు నేతృత్వం వహించాలో.. ప్రజాసామ్యయుతంగా నిర్ణయించాలని అన్నారు ప్రశాంత్.

'ప్రస్తుతం యూపీఏ అనేదే లేదు' అని బంగాల్​ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన మరుసటి రోజే పీకే ఇలా ట్వీట్​ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాంగ్రెస్​ కౌంటర్

పీకే వ్యాఖ్యలను కాంగ్రెస్​ వెంటనే తిప్పికొట్టింది. ఆయన ట్వీట్​ను ట్యాగ్​ చేస్తూ కాంగ్రెస్​ ప్రతినిధి పవన్​ ఖేరా.. పీకేను సైద్ధాంతిక నిబద్ధత లేని వ్యక్తిగా అభివర్ణించారు.

Prashant Kishor Attacks congress leadership, Congress hits back
కాంగ్రెస్​పై పీకే ఫైర్​

''ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో పార్టీలకు ఆయన ఉచితంగా సలహాలు ఇవ్వొచ్చు కానీ.. మన రాజకీయాల అజెండాను ఆయన నిర్దేశించలేరు.''

- పవన్​ ఖేరా, కాంగ్రెస్​ ప్రతినిధి

కొన్ని నెలల క్రితం పీకే.. కాంగ్రెస్​లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ పార్టీ సీనియర్లు కొందరు దీనిని వ్యతిరేకించినట్లు తెలిసింది. అప్పటి నుంచి ప్రశాంత్​ కిశోర్​ కాంగ్రెస్​పై వరుస విమర్శలు చేస్తున్నారు. రాహుల్​ గాంధీ కంటే ప్రియాంక గాంధీ బలమైన నేత అని, ఆమెను చూసి రాహుల్​ భయపడుతున్నారని ఓసారి ట్వీట్​ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఉదంతంపై ఉద్యమించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలోని ప్రతిపక్ష పాత్ర వేగంగా బలోపేతం అవుతుందని అశపెట్టుకోవడం తొందరపాటు అవుతుందని హెచ్చరించారు పీకే. అంతర్గతంగా ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్‌ పునరుత్థానం సాధించలేదని చెప్పారు.

ఇదీ చూడండి: Mamata Vs Congress: టీఎంసీ, కాంగ్రెస్ ఫైట్- భాజపా సేఫ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.