మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ.. కాంగ్రెస్‌ని వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరుతారని వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.
"తృణమూల్ ఎంపీ ఖైలీపుర్ రహమాన్, మరో ఎంపీ తాహార్ ఖాన్, మంత్రి అఖ్రుజ్జామన్..తన ఇంటికి వచ్చి టీ తాగి, కాసేపు ముచ్చటించారు. దాంతో నేను తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోతున్నాననే వదంతులు వ్యాపించాయి. అదంతా నిజం కాదు. మా ఇంటికి వచ్చిన తృణమూల్ నేతలకు మానాన్నతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ చొరవతో ఇంటికి వచ్చారు అంతే."
-అభిజిత్ ముఖర్జీ, కాంగ్రెస్ మాజీ ఎంపీ
తాను ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టానని, వాటివల్ల ఇతర పార్టీ నేతలతో సంప్రదిస్తూ ఉంటున్నానని అన్నారు అభిజిత్.
గతంలో ఎంపీగా పనిచేసిన అభిజిత్.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంగాల్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
ఇదీ చదవండి: టీఎంసీలోకి తిరిగొచ్చిన ముకుల్ రాయ్