ETV Bharat / bharat

'పూజ తల్లిదండ్రులకు మంత్రి డబ్బులిచ్చారు' - మహారాష్ట్ర మంత్రి సంజయ్​ రాఠోడ్​

పూజా చౌహాన్​ కేసుపై ఆమె అమ్మమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుపై నోరుమెదపకుండా ఉండేందుకు పూజా తల్లిదండ్రులకు మాజీ మంత్రి సంజయ్​ రాఠోడ్​ రూ. 5 కోట్లు లంచం ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను రాఠోడ్​ ఖండించారు.

pooja chavan
'పూజా తల్లిదండ్రులకు మంత్రి డబ్బులిచ్చారు'
author img

By

Published : Mar 1, 2021, 3:04 PM IST

పూజా చౌహాన్​ ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి సంజయ్​ రాఠోడ్​పై ఆమె బంధువు తీవ్ర ఆరోపణలు చేశారు. కేసుపై మౌనం వహించేలా పూజ తల్లిదండ్రులకు సంజయ్​ భారీ మొత్తంలో డబ్బును ముట్టజెప్పారని పేర్కొన్నారు. మృతురాలి అమ్మమ్మ అయిన శాంతాబాయి రాఠోడ్​.. నిందితుడు రూ. 5 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఆ డబ్బును మృతురాలి తల్లిదండ్రులు రహస్యంగా దాచి పెట్టారన్నారు. అయితే ఈ ఆరోపణలను రాఠోడ్​ ఖండించారు.

ప్రముఖ టిక్​టాక్​ స్టార్​ పూజా చౌహాన్ (22) ఫిబ్రవరి 8న ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మరణం తర్వాత బయటపడ్డ కొన్ని ఆడియో క్లిప్స్..​ పూజ మృతిపై సందేహాలు వ్యక్తం చేశాయి. ఈ ఘటనలో సంజయ్​ రాఠోడ్​ హస్తం ఉందన్న ఆరోపణలు, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి రావడం వల్ల రాఠోడ్ ఆదివారం.. మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇదీ చదవండి : 'ఆయన నాయకత్వంలో కొత్త కూటమి అవసరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.