ETV Bharat / bharat

సచిన్ వాజేపై సస్పెన్షన్ వేటు

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో నిందితుడు, పోలీస్ అధికారి సచిన్ వాజేపై సస్పెన్షన్ పడింది. స్పెషల్ బ్రాంచ్ అదనపు కమిషనర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Police officer Sachin Waze placed under suspension
సచిన్ వాజేపై సస్పెన్షన్ వేటు
author img

By

Published : Mar 15, 2021, 1:55 PM IST

అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి సచిన్ వాజేపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్​ చేస్తూ స్పెషల్ బ్రాంచ్ అదనపు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని ముంబయి పోలీసు పీఆర్​ఓ ఎస్ చైతన్య వెల్లడించారు.

గత నెల 25న ముకేశ్ అంబానీ ఇంటి వద్ద జిలెటిన్​ ఉన్న స్కార్పియో కారును పోలీసులు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు ఎన్ఐఏ చేపడుతుండగా, ఆ కారు యజమానిగా పేర్కొన్న మన్​సుఖ్​ హిరేన్ కేసును వాజే ఆధ్వర్యంలో ముంబయి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే వాజేపై ఆరోపణలు రావడం వల్ల ఆయనను క్రైం బ్రాంచ్​ నుంచి తొలుత బదిలీ చేశారు.

అనంతరం ఈ కేసు దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ).. వాజేపై అభియోగాలు మోపి, అరెస్టు చేసింది. వాజేకు ఎన్​ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మార్చి 25 వరకు రిమాండ్​ విధించింది.

ఇదీ చదవండి: అంబానీ ఇంటి వద్ద బాంబులు- ఆ అధికారి పాత్ర ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.