ఝార్ఖండ్ దుమ్కా జిల్లాలోని తాల్ఝారీ ప్రాంతంలో దొంగ అనుకొని ఓ వ్యక్తిపై గ్రామస్థులు మూకదాడి చేశారు. ఈ ఘటనలో 40 ఏళ్ల ఆ వ్యక్తిని ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు అర్థరాత్రి ఓ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించాడని.. ఇంతలో ఇంటి యజమాని చూసి గట్టిగా అరవడం వల్ల అతను పారిపోయో ప్రయత్నం చేశాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో గ్రామస్థులు అతన్ని పట్టుకుని.. చెట్టుకు కట్టి మూకదాడి దాడి చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం..
దుమ్కా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున 4:00 గంటల ప్రాంతంలో కపర్జోడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని సురేశ్ యాదవ్‌గా గుర్తించారు. దుమ్కాలో ఈ గుంపు దాడిపై సమాచారం అందిన వెంటనే తాల్ఝారీ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కాగా, మృతుడి కుమారుడి వాదన మరోలా ఉంది. తన తండ్రికి ఉదయం 3 గంటల సమయంలో ఓ కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని సురేశ్ యాదవ్ కుమారుడు తెలిపాడు. ఆ తరువాత తన తండ్రి బయటకు వెళ్లాడని చెప్పాడు. ఉదయం ఆరు గంటలకు హత్య గురింతి తమకు తెలిసిందన్నాడు.
కానిస్టేబుల్ ఆత్మహత్య
ఛత్తీస్గడ్ రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంబాగడ్లోని ఔంధీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు దీనిపై పూర్తి స్థాయి చేస్తున్నారని.. ఎస్పీ వై అక్షయ్ కుమార్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేద్రమ్ రాజ్ నక్సల్ ప్రభావిత ప్రాంతమైన.. డోమికలా బేస్ క్యాంప్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. వేద్రమ్కు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని చనిపోయాడు. ఈ విషయం ఉన్నత స్థాయి అధికారులకు తెలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 'మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందించాం. ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. పూర్తి స్థాయి విచారణ చేపడతా'మని పోలీసులు తెలపారు.