ETV Bharat / bharat

వయసు 22 ఏళ్లు.. పెళ్లిళ్లు 11..!

ఫేస్​బుక్​ ద్వారా అతనితో ఏర్పడిన పరిచయాన్ని ఆమె వివాహ బంధంగా మార్చుకుంది. తల్లిదండ్రులను కాదని అతనితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమైంది. కానీ తర్వాతే తెలిసింది అతడో నిత్యపెళ్లికొడుకని. నిందితుడిని తమిళనాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 22 ఏళ్ల లవ్లీ గణేష్​ ఇప్పటివరకు 11 పెళ్లిళ్లు చేసుకున్నాడు.

author img

By

Published : Jan 15, 2021, 8:28 PM IST

police caught cheater
వయసు 22 ఏళ్లు.. పెళ్లిళ్లు 11

మాయమాటలతో మహిళలను మోసం చేసిన ఓ యువకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడు లవ్లీ గణేష్ ఇప్పటివరకు ఏకంగా 11 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఓ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై చర్యలు చేపట్టారు. అతడి వయసు 22 ఏళ్లే కావడం గమనార్హం.

police caught cheater
నిందితుడు గణేష్​

ఇదీ కథ..

చెన్నైలోని విల్లీవకం ప్రాంతంలో గణేష్​ నివాసం ఉంటున్నాడు. ఫిర్యాదు చేసిన మహిళకు.. 2017లో గణేష్​తో ఫేస్​బుక్​ ద్వారా పరిచయం ఏర్పడింది. గతేడాది డిసెంబరు 5న వీరు వివాహం చేసుకున్నారు.

తల్లిదండ్రులను కాదని..

వారి పెళ్లి గురించి తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు విల్లీవక్కం మహిళా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. భర్తే సర్వస్వం అనుకున్న బాధితురాలు నిందితుడితోనే ఉంటానంటూ పోలీసులకు స్పష్టం చేసింది. మేజర్​ కావడంతో పోలీసులు కూడా ఆమె నిర్ణయాన్ని కాదనలేకపోయారు. నిందితుడి మాయలో పడి మిగిలిన బాధితురాళ్లు కూడా ఇదే ఊహించుకుని ఉంటారు. పాపం వారికేం తెలుసు వారి జీవితం ప్రశ్నార్థకం అవుతుందని.

రంగులు మారాయి..

క్రమంగా నిందితుడి నిజస్వరూపం బాధితురాలికి తెలిసొచ్చింది. పనిమనిషిగా పరిచయం చేసిన ఓ 17 ఏళ్ల అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంపై భార్య ప్రశ్నించగా.. ఆమెను హింసించాడు. కాళ్లూ చేతులూ కట్టేసి ఓ గదిలో బంధించి ఆమెను వేధించసాగాడు. తాను 11 మందిని పెళ్లి చేసుకున్నాను అంటూ ఆమెపై పైశాచికంగా ప్రవర్తించాడు. అక్కడినుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు గణేష్​పై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చదవండి : మంత్రి శ్రీపాదనాయక్​కు వెంకయ్య పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.