ETV Bharat / bharat

PM YASASVI Scholarship Entrance Test 2023 : మీ పిల్లలతో ఈ పరీక్ష రాయించండి.. రూ.2.5 లక్షల స్కాలర్​షిప్ పొందండి..! - పీఎం యశస్వి స్కాలర్​షిప్ అర్హతలు

PM YASASVI Entrance Test 2023 : మీకు ఈ విషయం తెలుసా..? పేద విద్యార్థుల చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం.. 'పీఎం యశస్వి' అనే స్కీమ్​ తీసుకొచ్చింది. ఈ పథకానికి సెలక్ట్ అయితే.. ఏకంగా 2.5 లక్షల రూపాయల స్కాలర్ షిప్ పొందొచ్చు. మరి, దీనికి సంబంధించిన విధి విధానాలేంటో ఇప్పుడు చూద్దాం.

PM YASASVI Scholarship Entrance Test 2023
PM YASASVI Entrance Test
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 1:45 PM IST

PM YASASVI Scheme 2023 : ప్రతిభ ఉండి కూడా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేసి.. పనిబాట పడుతున్న విద్యార్థులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అదే పీఎం యశస్వి(PM Young achievers Scholarship Award Scheme for Vibrant India)స్కీమ్. ఈ పథకం పేద విద్యార్థులకు వరంగా మారింది. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈ పథకాన్ని నిర్వహిస్తోంది.

పీఎం యశస్వి స్కాలర్​షిప్ పరీక్ష తేదీ ఇదే..

PM YASASVI Entrance Test 2023 Date : ఈ స్కాలర్ షిప్ టెస్ట్.. 9, ఇంకా.. 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఈ ఏడాది పరీక్ష రాయబోతున్న వారినుంచి ఆగస్టులోనే దరఖాస్తులు స్వీకరించారు. సెప్టెంబర్ 5 నుంచి వెబ్​సైట్​లో హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యశస్వి ప్రవేశ పరీక్షను(YASASVI Entrance Exam) సెప్టెంబర్ 29న.. దేశవ్యాప్తంగా 78 నగరాల్లో నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, అమరావతి, నెల్లూరు, విశాఖపట్నం లాంటి నగరాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తారు.

NABARD Jobs 2023 : నాబార్డ్​లో అసిస్టెంట్​ మేనేజర్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

యశస్వి ప్రవేశ పరీక్ష విధానమిలా.. (YASASVI Entrance Exam Procedure in Telugu) :

యశస్వి ఉపకార వేతనాల కోసం నిర్వహించే ఈ అర్హత పరీక్షను.. ఆంగ్లం లేదా హిందీలో మాత్రమే రాయాల్సి ఉంటుంది.

మూడు గంటల పాటు ఈ ఎగ్జామ్​ ఉంటుంది.

నాలుగు అంశాలకు సంబంధించి.. వంద ప్రశ్నలు ఇస్తారు.

ఒక్కో సమాధానానికి నాలుగు మార్కుల వంతున.. మొత్తం 400 మార్కులకు ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది.

గణితంలో 30 ప్రశ్నలకు 120 మార్కులు

సైన్స్‌లో 20 ప్రశ్నలకు 80 మార్కులు

సాంఘికశాస్త్రంలో 25 ప్రశ్నలకు వంద మార్కులు

జనరల్‌ అవేర్‌నెస్‌లో 25 ప్రశ్నలకు వంద మార్కులు కేటాయించారు.

ఆబ్జెక్టివ్ పద్ధతిలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

నెగెటివ్‌ మార్కులు లేవు.

ఎలా విద్యార్థులను ఎంపిక చేస్తారు..?

PM YASASVI Scheme Benefits : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న(NTA) ఈ 'యశస్వి స్కాలర్​షిప్​ ప్రవేశ పరీక్ష-2023'లో మెరిట్ ఆధారంగా ఈ స్కీమ్​కు విద్యార్థులను ఎంపిక చేస్తారు.

ఉపకార వేతనం ఎంత చెల్లిస్తారు..?

9, 10 తరగతులకు గానూ ఏడాదికి రూ.75వేలు చొప్పున అందిస్తారు.

11, 12 తరగతులకు గానూ.. ఏడాదికి రూ.1,25,000 చొప్పున ఉపకారవేతనం చెల్లిస్తారు.

ఎంపికైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌(Scholarship) మొత్తాన్ని ఒకేసారి వారి అకౌంట్లో జమ చేస్తారు.

Employment News 2023 : ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం.. ఆగస్టు 2023

How to Check TS ePASS Scholarship Status : మీ స్కాలర్​షిప్ స్టేటస్ ఇలా చెక్​ చేసుకోండి..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.