ETV Bharat / bharat

'అందువల్లే 'అమృత్​ మహుత్సవ్​'పై మోదీ మాట్లాడలేదు'

'అమృత్​ మహోత్సవ్​'పై పార్లమెంట్​లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడకపోవడంపై స్పష్టతనిచ్చారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. సభలో గందరగోళ పరిస్థితుల వల్లే ఆ విషయంపై ప్రధాని మాట్లాడలేదని తెలిపారు.​

PM unable to make statement in LS on 'Azadi ka Amrut Mahotsav' due to ongoing disruptions: Joshi
'అందువల్లే 'అమృత్​ మహుత్సవ్​'పై మోదీ మాట్లాడలేదు'
author img

By

Published : Mar 10, 2021, 3:47 PM IST

పార్లమెంట్​ రెండో విడత బడ్జెట్​ సమావేశాల్లో లోక్​సభలో విపక్షాల నిరసన వల్లే 'అమృత్​ మహుత్సవ్​'పై ప్రధాని నరేంద్ర మోదీ ఎటువంటి ప్రకటన చేయలేకపోయారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చమురు సహా సాగు చట్టాలపై చర్చ జరపాలని నిరసనలు చేపట్టాయి విపక్షాలు. దీంతో లోక్​సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే ప్రధాని మాట్లాడలేదని ప్రహ్లాద్​ స్పష్టం చేశారు.

"అమృత్​ మహోత్సవ్​పై పార్లమెంట్​లో ప్రధాని మాట్లాడాలని భావించారు. ఇందుకు స్పీకర్​ అనుమతి ఇచ్చారు. అయితే సభలో ఏకాభిప్రాయం లేదు. సభ సజావుగా సాగిన ప్రతిసారి ప్రధాని ఓ కీలక ప్రకటన చేస్తారు."

- ప్రహ్లాద్​ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

ఈ ఏడాది 'అమృత్​ మహోత్సవ్'​ పేరుతో నిర్వహించనున్న 75వ స్వాతంత్య్ర వేడుకల గుజరాత్​లో మార్చి 12న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సబర్మతి ఆశ్రమం నుంచి 21 రోజులు 'దండి మార్చ్​'ను కూడా నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: 75 వారాలు.. 75చోట్ల.. 75వ స్వాతంత్య్ర వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.