ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రుల సమావేశం బుధవారం జరగనుంది. కరోనా పరిస్థితులతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షించనున్నారని సమాచారం. ప్రధాని అధికారిక నివాసంలో సాయంత్రం వర్చువల్గా ఈ భేటీ ఉంటుంది.
రోడ్డు, రవాణా, పౌర విమానయాన, టెలికం శాఖల పనితీరును మోదీ సమీక్షించనున్నారని సమాచారం. అలాగే కరోనాపై విస్తృత స్థాయిలో చర్చ జరగనుందని అంచనా. ఇప్పటికే పలు మంత్రిత్వ శాఖల పనితీరును ప్రధాని సమీక్షించారు.
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశంలో పాల్గొనున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సమయంలో ఈ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి:దేశ భద్రతపై మోదీ కీలక భేటీ