ETV Bharat / bharat

భద్రతా దళాల అధినేతల సదస్సుకు మోదీ - గుజరాత్

గుజరాత్​లో జరుగుతున్న దేశ భద్రతా దళాల అధిపతుల సమావేశంలోప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు ప్రసంగించనున్నారు. తొలిసారి ఈ సదస్సులో జవాన్లూ పాల్గొంటున్నారు.

PM
సంయుక్త కమాండర్ల సదస్సులో మార్చి6న మోదీ ప్రసంగం
author img

By

Published : Mar 4, 2021, 4:03 PM IST

గుజరాత్​లోని కేవడియాలో జరుగుతున్న దేశ భద్రతా దళాల అధిపతుల సమావేశంలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. తొలిసారి ఈ సదస్సుకు జవాన్లు, జూనియర్​ కమిషన్డ్​ ఆఫీసర్​లు హాజరవుతున్నారు. సిబ్బంది సమస్యలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక సెషన్లలో మాత్రమే వీరు పాల్గొంటారని అధికారులు తెలిపారు.

తీవ్ర ఉద్రిక్తతల అనంతరం భారత్​, చైనా సైనిక బలగాల ఉపసంహరణ చేపడుతున్న క్రమంలో కేవడియాలో గురువారం మొదలైన 3 రోజుల సదస్సుకు ప్రాధాన్యం ఏర్పడింది. దేశ త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, సైన్యాధిపతి జనరల్​ ఎమ్​ఎమ్​ నరవణే, వైమానిక దళాధిపతి మార్షల్​ ఆర్​కేఎస్​ భదౌరియా, నావిక దళాధిపతి అడ్మిరల్​ కరంబీర్​ సింగ్​, రక్షణ శాఖ అధికారులు, జవాన్లు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

ఇదీ చూడండి: తాజ్​మహల్​కు బాంబు బెదిరింపు​ వారి పనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.