ETV Bharat / bharat

నేడు సైనిక అధికారుల సదస్సులో మోదీ ప్రసంగం

కేవడియాలో జరుగుతున్న ఉన్నత స్థాయి సైనిక అధికారుల సదస్సు ముగింపులో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రసంగించనున్నారు. త్రివిధ దళాల అధిపతులు, వివిధ స్థాయికి చెందిన 30 మంది అధికారులు, జవాన్లు ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. దేశ భద్రతా పరిస్థితి, త్రివిధ దళాల సన్నద్ధతను ఈ సదస్సులో మోదీ సమీక్షిస్తారు.

PM to address commanders' conference at Kevadia tomorrow
నేడు సైనిక అధికారుల సదస్సులో మోదీ ప్రసంగం
author img

By

Published : Mar 6, 2021, 5:54 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు గుజరాత్​లోని కేవడియాలో జరగుతున్న ఉన్నత స్ధాయి సైనిక అధికారుల మేథోమథన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో తొలిసారిగా జవాన్లు, జూనియర్ కమిషన్డ్ అధికారులు కూడా పాల్గొంటున్నారు. త్రివిధ దళాల్లో వివిధ స్థాయికి చెందిన 30 మంది అధికారులు, జవాన్లు ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు.

దేశ భద్రతా పరిస్థితి, త్రివిధ దళాల సన్నద్ధతను ఈ సదస్సులో మోదీ సమీక్షిస్తారు. తీవ్ర ఉద్రిక్తతల అనంతరం భారత్​, చైనా బలగాల ఉపసంహరణ చేపట్టిన సమయంలో ఈ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గురువారం ప్రారంభమైన ఈ సదస్సు నేటితో ముగుస్తుంది. త్రివిధ దళాల అధిపతులు ఇందులో పాల్గొంటున్నారు.

ఇదీ చూడండి: బలగాల ఉపసంహరణకు చైనాతో చర్చలు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.