ETV Bharat / bharat

న్యూ ఇయర్​ కానుక- రైతుల ఖాతాల్లోకి రూ.20,900 కోట్లు - పెట్టుబడి సాయం

Kisan Samman Nidhi: ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి 10వ విడత నిధులను విడుదల చేశారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా వర్చువల్​గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు.

PM
మోదీ
author img

By

Published : Jan 1, 2022, 2:03 PM IST

Updated : Jan 1, 2022, 2:50 PM IST

Kisan Samman Nidhi: రైతులకు ప్రతి ఏటా అందించే పెట్టుబడి సాయం ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి 10వ విడత నిధులను వర్చువల్​గా విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పథకంలోని పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 10.09 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20,900 కోట్లు జమ అయ్యాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. ఎగుమతుల్లో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. అందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

"ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 8శాతానికిపైగా ఉంది. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు భారత్​కు వస్తున్నాయి. జీఎస్​టీ రాబడిలో గత రికార్డులు బద్దలవుతున్నాయి. ఎగుమతుల్లో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. 2021లో కేవలం యూపీఐ ద్వారానే రూ.70 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇప్పుడు 50వేలకుపైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో గత 6నెలల్లోనే 10వేల అంకురాలు నమోదయ్యాయి. పర్యావరణ మార్పులపై ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నాం. 2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తొలగించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అలాగే.. విద్యుత్తు వాహనాల కోసం కృషి చేస్తున్నాం. 2021లో అమ్మాయిల వివాహ వయసును 18 నుంచి 21కి పెంచాం. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పీఎం గతిశక్తి జాతీయ బృహత్తర ప్రణాళిక ఒక రూపును తీసుకురానుంది. మేక్​ ఇన్​ ఇండియాకు కొత్త మార్గాలు చూపుతూ.. చిప్, సెమీకండక్టర్ల తయారీ కోసం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చాం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ముందు జాగ్రత్త, అప్రమత్తతో కొవిడ్​-19పై భారత్​ పోరాటం చేస్తుందన్నారు ప్రధాని. జాతీయ ప్రయోజనాలను కాపాడుతామని తెలిపారు. ఆరోగ్యం, రక్షణ, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో 2021లో సాధించిన విజయాలను వివరించారు. దేశంలో 145 కోట్ల కరోనా టీకా డోసులు అందించినట్లు తెలిపారు. కరోనా వైరస్​ పలు సవాళ్లను ఇచ్చింది, కానీ, దేశ అభివృద్ధిని అడ్డుకోలేదని పేర్కొన్నారు. కరోనా సమయంలో దేశంలోని 80 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.2.6 లక్షల కోట్ల ఆహార ధాన్యాలను ఉచితంగా అందించినట్లు చెప్పారు. రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాలని సూచించారు. అలాంటి వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్​ ఉందన్నారు.

ప్రతి ఏటా రూ.6వేలు..

పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి సాయంగా రూ.6వేలు అందిస్తోంది కేంద్రం. దీనిని మూడు వాయిదాల్లో రూ.2000 చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 10వ విడత నిధులను ఖాతాల్లో జమ చేసింది. అలాగే.. దేశంలోని 351 ఫార్మర్స్​ ప్రొడ్యూసర్​ ఆర్గనైజేషన్స్​(ఎఫ్​పీఓ)లకు రూ.14 కోట్లు ఈక్విటీ గ్రాంట్స్​ విడుదల చేశారు మోదీ. దీని ద్వారా 1.24 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.

ఈ కార్యక్రమంలో 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, వ్యవసాయ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

Last Updated : Jan 1, 2022, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.