ETV Bharat / bharat

'డిజిటల్​ ఇండియాతో సాంకేతిక సాధికారత' - ప్రధాని మోదీ డిజిటల్​ ఇండియా

డిజిటల్ ఇండియా లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ.. గురువారం మాట్లాడారు. టెక్నాలజీ, యువశక్తి.. భారత దేశాభివృద్ధికి భారీ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు.

pm modi on digital india, pm modi interaction digital india
డిజిటల్​ ఇండియా లబ్ధిదారులతో ముచ్చటించిన ప్రధాని
author img

By

Published : Jul 1, 2021, 12:24 PM IST

Updated : Jul 1, 2021, 2:00 PM IST

దేశంలోని మెరుగైన సాంకేతికత, ​డేటా, యువశక్తి.. సాంకేతిక అభివృద్ధికి భారీ అవకాశాలు కల్పిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ డికేడ్​(దశాబ్దం) భారత్​కు టెకేడ్​​ అని వ్యాఖ్యానించారు. దేశంలో డేటా భద్రతకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. డిజిటల్​ ఇండియా ఆరో వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఆరేళ్ల కాలంలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు కేంద్రం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. సాంకేతికత సాధికారతలో డిజిటల్​ ఇండియాది కీలక పాత్ర అన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్​ తయారు చేసిన ఆరోగ్య సేతు వంటి యాప్​లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు.

pm modi on digital india, pm modi interaction digital india
డిజిటల్​ ఇండియా లబ్ధిదారులతో ముచ్చటించిన ప్రధాని

ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు మోదీ. ఐటీ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ సహా పలువురు నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డిజిటల్ ఇండియా పథకాన్ని 2015లో కేంద్రం ప్రారంభించింది.

ఇదీ చదవండి : కరోనాపై కేంద్ర మంత్రులకు మోదీ కీలక ఆదేశాలు

Last Updated : Jul 1, 2021, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.