ETV Bharat / bharat

'ప్రజా సేవ కంటే వ్యక్తిగత అజెండా ముఖ్యమా?' - congress on Government

కరోనా కట్టడి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడింది కాంగ్రెస్​. వ్యక్తిగత అజెండాతో కాకుండా.. ప్రజా సేవకు కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించింది. టీకాల సరఫరా తగినంతగా లేదని ఆరోపించింది. కరోనా కేసులు, మరణాలపై ప్రభుత్వం వద్ద గణాంకాలున్నాయా? అని ప్రశ్నించింది.

CWC
కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ
author img

By

Published : May 10, 2021, 5:25 PM IST

Updated : May 10, 2021, 6:07 PM IST

కరోనా కట్టడి విషయమై కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించింది కాంగ్రెస్​. ప్రధాని నరేంద్ర మోదీ తన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. వ్యక్తిగత అజెండాతో కాకుండా.. ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉండాలని కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) పేర్కొంది. కేంద్ర సర్కారు టీకా వ్యూహంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్​.. సరఫరా తగినంతగా లేదని ఆరోపించింది. అలాగే ధరల విధానంలో కూడా పారదర్శకత లేదని ధ్వజమెత్తింది.

కరోనా కేసులు, మరణాల గణాంకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సీడబ్ల్యూసీ.. ఇందుకు సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి నివేదికలు లేవని ఆరోపించింది. అలాగే సమస్యను ఎదుర్కొనే విషయంలో మోదీ సర్కారు తమ తెగువ చూపాలని.. నిజాన్ని దాచే విషయంలో కాదని వ్యాఖ్యానించింది. కొవిడ్​ రెండోదశను తీవ్ర విపత్తుగా అభివర్ణించిన కాంగ్రెస్​.. ఇది మోదీ సర్కారు ఉదాసీనత, అసమర్థతకు ప్రత్యక్ష పర్యవసానమని పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ ఐక్యత, సంకల్ప బలాన్ని చూపాలని సీడబ్ల్యూసీ బలంగా నమ్ముతున్నట్లు కాంగ్రెస్​ నేతలు కేసీ వేణుగోపాల్​, రణదీప్​ సుర్జేవాలా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: టీకా, ఔషధాల కోసం గుంపులు గుంపులుగా - ముప్పు తప్పదా?

Last Updated : May 10, 2021, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.