అమెరికాకు బయల్దేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi US visit 2021) ప్రయాణిస్తున్న విమానం.. అఫ్గానిస్థాన్ మీదుగా కాకుండా పాకిస్థాన్ గగనతలంపై నుంచి వెళ్లింది. మోదీ ప్రయాణం కోసం తన గగనతలాన్ని (Pakistan airspace open for India) ఉపయోగించుకునేందుకు పాకిస్థాన్ అనుమతించింది.
అఫ్గాన్‌లో భద్రతా పరిస్థితులు ఆందోళకరంగా ఉన్న నేపథ్యంలో ఆ దేశ గగనతలాన్ని (India Pakistan airspace) ఉపయోగించుకోవద్దని భారత నిఘా వర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటన కోసం మోదీ విమానానికి అనుమతి ఇవ్వాలని భారత్.. పాక్‌ను కోరిందని అధికారులు తెలిపారు. ఇందుకు పాకిస్థాన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దు (abolition of article 370) తర్వాత భారత్‌పై గుర్రుగా ఉన్న పాకిస్థాన్.. గగనతలాన్ని ఉపయోగించుకోకుండా చేస్తోంది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐస్లాండ్ పర్యటన సహా మోదీ అమెరికా, జర్మనీ పర్యటనల కోసం భారత అధికారులు గతంలో అనుమతులు కోరారు. ఈ మూడుసార్లూ అనుమతులు తిరస్కరించి వైరం చాటుకుంది.
దీనిపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ వద్ద భారత్ నిరసన వ్యక్తం చేసింది. అయితే, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శ్రీలంక పర్యటన కోసం మన గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు భారత్ అనుమతించడం గమనార్హం.
మోదీ పర్యటన...
మూడు రోజుల పర్యటన కోసం అమెరికాకు బయల్దేరారు ప్రధాని మోదీ(Modi US visit 2021). క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం సహా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా సహా పలువురు ఉన్నతాధికారులు మోదీతో పాటు అమెరికాకు వెళ్తున్నారు.
భారత వీవీఐపీ విమానమైన 'ఎయిర్ఇండియా వన్'లో (Air India One) వీరంతా అమెరికాకు వెళ్లారు. 15 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణించి ఇది అమెరికాకు చేరుకోనుంది. అఫ్గాన్‌పై నుంచి కాకుండా పాకిస్థాన్‌పై నుంచి వెళ్తుండటం వల్ల ప్రయాణ సమయం గంట అధికమైంది.
విమానం ఎంతో ప్రత్యేకం
మోదీ ప్రయాణిస్తున్న ఎయిర్ఇండియా వన్ విమానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యంత పటిష్ఠ భద్రతతో దీన్ని రూపొందించారు. క్షిపణులు ప్రయోగించినా వాటిని అడ్డుకునే సాంకేతికత ఇందులో అందుబాటులో ఉంది. ఈ విమానానికి సంబంధించిన మరిన్ని ఫీచర్ల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవీ చదవండి: