ETV Bharat / bharat

వచ్చేవారం ఐరాసలో మోదీ ప్రసంగం - ఎడారీకరణ

ఎడారీకరణ, భూమి సారహీనత, కరవుల నివారణపై వచ్చేవారం ఐరాసలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. భూ క్షీణత నివారణలో సాధించిన పురోగతి, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

desertification and land degradation
ఐరాసలో మోదీ ప్రసంగం
author img

By

Published : Jun 11, 2021, 11:52 AM IST

వచ్చేవారం ఐరాసలో ఎడారీకరణ, భూమి క్షీణత, కరవుల నివారణపై జరిగే ఉన్నతస్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఐరాస సాధారణసభ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

2019లో దిల్లీ వేదికగా ఎడారీకరణను ఎదుర్కోవటంపై ఐరాస ఆధ్వర్యంలో జరిగిన 14వ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈనెల 14న ఉదయం.. ఏడారీకరణను ఎదుర్కోవటంపై ఐరాస నిర్వహించే ఉన్నతస్థాయి సమావేశంలో 14వ సదస్సు అధ్యక్షునిగా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

ఐరాస ఉప ప్రధాన కార్యదర్శి సహా అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజం తరఫున వ్యవసాయ రంగ నేతలు, వారి ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. భూమి సారహీనత నివారణకు ఇప్పటివరకూ సాధించిన పురోగతి, సారవంతమైన భూమి పునరుద్ధరణకు ప్రపంచవ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై ప్రధానంగా ఐరాస సమావేశం దృష్టి సారించనుంది.

ఇదీ చూడండి: కరవు కోరల్లో ప్రపంచం- కలసి పోరాడితేనే ఫలితం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.