ETV Bharat / bharat

ఆ భయంతోనే 'అవిశ్వాసం' ఓటింగ్‌పై విపక్షాలు దూరం.. ప్రతిపక్ష కూటమి 'ఇండియా'పై మోదీ ఫైర్​

PM Modi Speech Today : ప్రతిపక్ష కూటమి 'ఇండియా'పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. ఇండియా కూటమిలో చీలికలు బయటపడతాయనే భయంతోనే అవిశ్వాస తీర్మానంపై విపక్ష ఎంపీలు ఓటింగ్​లో పాల్గొనలేదని అన్నారు. అలాగే.. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు టీఎంసీ ప్రయత్నించిందని ఆరోపించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ శనివారం ప్రసంగించారు.

PM Modi Speech Today
PM Modi Speech Today
author img

By

Published : Aug 12, 2023, 12:26 PM IST

Updated : Aug 12, 2023, 2:47 PM IST

PM Modi Speech Today : విపక్ష కూటమి 'ఇండియా' కూటమిలో చీలికలు బయటపడతాయనే భయంతోనే విపక్షాలు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందుకు రాలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి.. ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించాలనుకున్న విపక్షాలకు గట్టి సమాధానం ఇచ్చామని తెలిపారు. బీజేపీ క్షత్రియ పంచాయతీ రాజ్‌ పరిషద్‌ కార్యకర్తలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన మోదీ.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

  • #WATCH | PM Modi alleges TMC of threatening BJP candidates and booth capturing during West Bengal Panchayat polls

    "They do anything required to ensure that no BJP candidate can file nomination..they not only threaten BJP workers but also the voters. Contracts are given out to… pic.twitter.com/9yhGFfjWHA

    — ANI (@ANI) August 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్​లో ప్రతిపక్షాలు పాల్గొనలేదు. ఎందుకంటే ఓటింగ్ పాల్గొంటే తమ కూటమిలో విభేదాలు బహిర్గతం అవుతాయని వారికి తెలుసు. అందుకే ఓటింగ్ సమయంలో లోక్​సభ నుంచి వాకౌట్ చేశారు. మణిపుర్​పై ప్రతిపక్షాలు చర్చను కోరుకోలేదు. కేవలం రాజకీయాలు చేయాలనుకున్నారు."
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని

Narendra Modi On Congress : కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కొన్ని దశాబ్దాల క్రితం 'గరీబీ హఠావో' అనే నినాదాన్ని ఓ పార్టీ ఇచ్చిందని.. కానీ పేదరికాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఏమీ చేయలేదని అన్నారు. దేశంలోని పేదల అభ్యున్నతికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.

బంగాల్​లో రక్తపాత రాజకీయాలు..
బంగాల్‌లో రక్తపాత రాజకీయాలు జరుగుతున్నాయని మమతా బెనర్జీ సర్కార్​పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేసేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అనేక విధాలుగా ప్రయత్నించిందని మోదీ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినప్పుడు ఊరేగింపునకు టీఎంసీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అన్నారు. టీఎంసీ పార్టీ ఓట్ల లెక్కింపు రోజున బూత్​లను స్వాధీనం చేసుకునేందుకు గూండాలకు కాంట్రాక్టులు ఇచ్చిందని విమర్శించారు. కౌంటింగ్ సమయంలో బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఎద్దేవా చేశారు.

కేంద్రంపై మమత ఫైర్​..
కేంద్ర ప్రభుత్వంపై బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. మణిపుర్​లో అఘాయిత్యాలకు పాల్పడినవారిపై బీజేపీ సర్కార్​ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ అవినీతిపై మాట్లాడలేరని.. ఎందుకంటే ఆయన నేతృత్వంలోని బీజేపీ సర్కార్​పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఎటువంటి ఆధారాలు లేకుండా విపక్షాలపై నిందలు వేస్తున్నారని అన్నారు.

  • "He (PM Modi) is speaking without any evidence. He wants common people to suffer. You can’t raise corruption issues because you are surrounded by issues like the PM Cares fund, Rafale deal, and demonetisation. You can fool people sometimes but not all the time. You never take any… https://t.co/lDMtp06oJC pic.twitter.com/1YIrAUd1h1

'కాంగ్రెస్‌ కుటిల రాజకీయాలే ఈశాన్య రాష్ట్రాల్లో చిచ్చురేపాయ్‌.. మణిపుర్​లో శాంతి నెలకొంటుందని హామీ ఇస్తున్నా'

PM Modi Today Speech : 'విపక్షాల కళ్లు మూసుకుపోయాయ్​.. 'ఇండియా' కూటమికి త్వరలోనే 'తాళం''

Last Updated : Aug 12, 2023, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.