PM Modi Speech at BJP Public Meeting in Nizamabad : వచ్చే ఐదేళ్లు తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే.. బీఆర్ఎస్ దోచుకున్నది అంతా మళ్లీ ప్రజల ముందు ఉంచుతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi Telangana Tour) చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ.. ముందుగా రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఇందూరులోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక(BJP Public Meeting in Nizamabad)పై నుంచే.. రామగుండంలో ఎన్టీపీసీ రూ.6 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టు(NTPC Electricity PROJECT)ను జాతికి అంకితం ఇచ్చారు. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీపుపై మోదీ నిల్చుకుని.. సభావేదిక వద్దకు వెళ్లే వరకు ప్రజలకు అభివాదం చేశారు. మహిళలు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున మోదీకి ఘనస్వాగతం తెలిపారు.
అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఘాటైన విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ వైఖరి పూర్తిగా మారిపోయిందన్నారు. కేసీఆర్ దిల్లీ వచ్చి తనను కలిశారని.. ఎన్డీయేలో చేరతామని.. తెలంగాణలో కేటీఆర్‌ను ఆశీర్వహించాలని కోరినట్లు చెప్పారు. అయితే ఇది రాజరికం కాదని చెబుతూ.. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
PM Modi Fires on CM KCR and BRS : "ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఒక రహస్యం.. ఇవాళ మీకు చెబుతున్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ వైఖరి పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ దిల్లీ వచ్చి తనను కలిశారు. తనపై ఎంతో ప్రేమ ఒలకబోశారని.. కేసీఆర్ గతంలో ఎన్నడూ అంత ప్రేమ చూపలేదు. అది ఆయన వ్యక్తిత్వంలోనే లేదు. తన నేతృత్వంలోనే దేశం దూసుకుపోతోందని కేసీఆర్ భజన చేశారు. తెలంగాణ పాలన పగ్గాలు కేటీఆర్‌కు ఇస్తానన్నారు. ఆయన ఆశీర్వదించాలని కోరారు. ఇది రాజరికం కాదని.. తాను కేసీఆర్‌కు గట్టిగా చెప్పాను. జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికలో మద్దతివ్వాలని అడిగారు. విపక్షంలోనైనా కూర్చుంటాం కానీ, మద్దతు ఇవ్వనని తెగేసి చెప్పాను. తెలంగాణ ప్రజలకు ద్రోహం చెయ్యనని కేసీఆర్‌కు స్పష్టం చేశాను. కేసీఆర్ కోరినా.. బీఆర్ఎస్ ఎన్డీయేలో చేరేందుకు నేను అంగీకరించలేదని" ప్రధాని మోదీ చెప్పారు.
"ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఒక రహస్యం.. ఇవాళ మీకు చెబుతున్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ వైఖరి పూర్తిగా మారిపోయింది. దిల్లీకి వచ్చిన కేసీఆర్.. తనపై ఎంతో ప్రేమ ఒలకబోశారు. కేసీఆర్ గతంలో ఎప్పుడూ ఇలా అంత ప్రేమను చూపలేదు. తెలంగాణ పాలన పగ్గాలు కేటీఆర్‌కు ఇస్తానన్నారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఇది రాజరికం కాదని.. తాను కేసీఆర్‌కు గట్టిగా చెప్పాను. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలన్నారు. మద్దతు ఇవ్వం అని తేల్చి చెప్పాను. కేసీఆర్ కోరినా.. బీఆర్ఎస్ ఎన్టీఏలో చేరేందుకు తాను అంగీకరించలేదు." - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
PM Modi Tour in Nizamabad : కొన్ని రోజుల క్రితమే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించినట్లు గుర్తు చేసిన మోదీ.. భరతమాత రూపంలో సభకు వచ్చిన మహిళలకు అభినందనలు తెలిపారు. మహిళలు తన సభకు పెద్ద సంఖ్యలో రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని.. భవిష్యత్‌లో మరింత మహిళా శక్తిని తాము చూడనున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత తెలంగాణకే దక్కుతుందని ప్రధాని ప్రశంసించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిఫలాలు అన్నీ ఒకే కుటుంబమే అనుభవిస్తోందని దుయ్యబట్టారు. కేసీఆర్, ఆయన కుమారుడు, కూతురు, అల్లుడు మాత్రమే ధనికులయ్యారని ధ్వజమెత్తారు. దీనిని అడ్డుకునేందుకే తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వవద్దని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని