ETV Bharat / bharat

PM Modi Song Lyrics : పాటకు లిరిక్స్ రాసిన ప్రధాని మోదీ.. మ్యూజిక్ ఆల్బమ్ చూశారా? త్వరలోనే ఇంకో సాంగ్ కూడా.. - నరేంద్ర మోడీ కొత్త పాట

PM Modi Song Lyrics : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనలోని మరో కోణాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఓ పాటకు లిరిక్స్ రాసిన విషయాన్ని వెల్లడించారు. త్వరలో మరో పాట వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.

PM Modi Song Lyrics
PM Modi Song Lyrics
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 3:36 PM IST

PM Modi Song Lyrics : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రచయిత అవతారం ఎత్తారు. ఇన్నాళ్లూ ఎవరికీ పెద్దగా తెలియని తనలోని ఈ కోణాన్ని దేశ ప్రజలకు పరిచయం చేశారు. నవరాత్రి ఉత్సవాల కోసం ఓ పాటకు లిరిక్స్ రాశారు. గార్బో పేరుతో రూపొందిన ఈ పాటకు తనిష్క్ బాగ్చి స్వరాలు సమకూర్చగా.. సింగర్ ధ్వని భానుశాలి ఆలపించారు. మోదీ రచించిన పాట కావడం వల్ల దీన్ని ఆయన అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

సింగర్ ట్వీట్
ఈ పాటను మోదీ స్వయంగా రచించిన విషయాన్ని తొలుత.. సింగర్ ధ్వని భానుశాలి ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. 'మోదీజీ మీరు రచించిన గార్బా పాట నాతో పాటు తనిష్క్ బాగ్చికి బాగా నచ్చింది. కొత్త రిథమ్, కంపోజిషన్​తో ఓ పాటను తీసుకురావాలని మేం అనుకున్నాం' అని ట్వీట్ చేశారు.

మోదీ రిప్లై
ఈ ట్వీట్​కు ప్రధాని మోదీ స్పందించారు. ధ్వని భానుశాలి ట్వీట్​కు రిప్లై ఇస్తూ.. ఆమెకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా తాను గతంలోనూ పాటలు రాశానని గుర్తు చేసుకున్నారు మోదీ. 'నా సాహిత్యంతో గార్బా పాటను అందించినందుకు ధన్యవాదాలు. చాలా రోజుల క్రితం నేను రాసిన పాట ఇది. గత జ్ఞాపకాలను ఇది నాకు గుర్తు చేసింది. కొన్ని ఏళ్లుగా నేను ఏ పాటనూ రాయలేదు. చాలా రోజుల తర్వాత ఈ మధ్యే ఓ పాటకు లిరిక్స్ రాశా. నవరాత్రి సందర్భంగా దాన్ని మీతో పంచుకుంటా' అని మోదీ ట్వీట్ చేశారు.

  • Thank you @dhvanivinod, Tanishk Bagchi and the team of @Jjust_Music for this lovely rendition of a Garba I had penned years ago! It does bring back many memories. I have not written for many years now but I did manage to write a new Garba over the last few days, which I will… https://t.co/WAALGzAfnc

    — Narendra Modi (@narendramodi) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కొనియాడిన కంగన
కాగా, బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఈ పాటపై స్పందించారు. మోదీని స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని పేర్కొంటూ కొనియాడారు. 'ఈ పాట ఎంత బాగుందో. అటల్​జీ (వాజ్​పేయీ) పద్యాలు, మోదీజీ పాటలు/కథలు ఎప్పుడూ మనసుకు హత్తుకునేలా ఉంటాయి. మన బలమైన హీరోలు కళతో భాగం కావడం చూస్తుంటే ఆనందంగా, కళాకారులు అందరికీ స్ఫూర్తివంతంగా ఉంటుంది' అని కంగన పేర్కొన్నారు.

గుజరాత్​లో జరిగే నవరాత్రి ఉత్సవాలను హైలైట్ చేస్తూ ఈ పాట సాగుతూ ఉంటుంది. ఈ పాటకు చాలా మంది సానుకూలంగా స్పందిస్తున్నారు. వీడియోలో మోదీ పేరును చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొందరు మోదీని అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

PM Modi Uttarakhand Visit : ఆదికైలాశ్​ను దర్శించుకున్న మోదీ.. పార్వతి కుండ్​లో స్వయంగా పూజలు

Puneeth Raj Kumar Portrait In The Field : పునీత్ ​రాజ్​కుమార్ అభిమాని చేసిన పనికి అందరూ ఫిదా.. రైతును అభినందించిన పవర్​స్టార్ భార్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.