ETV Bharat / bharat

PM Modi Palamuru Praja Garjana Public Meeting : 'తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాబోయేది చెప్పింది చేసే ప్రభుత్వం' - Modi criticizes BRS government

PM Modi Speech at Palamuru PrajaGarjana Public Meeting : పాలమూరు ప్రజాగర్జన వేదికగా బీఆర్ఎస్​ ప్రభుత్వంపై.. ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. భారత్ రాష్ట్ర సమితి సర్కార్​.. మజ్లిస్‌ చేతిలో ఉందని ఆరోపించిన ప్రధాని.. ‌అవినీతి, కమీషన్లకు ఆ రెండు పార్టీలు కేరాఫ్‌ అడ్రస్​గా మారాయని ఆక్షేపించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రైతులను తెలంగాణ ప్రభుత్వం దగా చేస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. చెప్పింది చేసే ప్రభుత్వం రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని.. ఈ ఎన్నికల తర్వాత ఆ సర్కార్‌ ఏర్పడుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Mahabubnagar district
Prime Minister Modi visit to Telangana
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 7:02 PM IST

Updated : Oct 1, 2023, 8:04 PM IST

PM Modi Speech at Palamuru PrajaGarjana Public Meeting తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

PM Modi Speech Palamuru Praja Garjana Public Meeting : పాలమూరు వేదికగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించింది. పాలమూరు ప్రజాగర్జనలో పాల్గొన్న ప్రధాని మోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. బీఆర్ఎస్, మజ్లిస్‌ పార్టీలపై విరుచుకుపడ్డ ప్రధాని.. ఆ రెండు పార్టీలు కుటుంబపాలనలో మగ్గిపోతున్నాయని ఆక్షేపించారు. ఆ రెండు పార్టీల వైఖరి వల్లే తెలంగాణ ప్రగతి కుంటుపడుతోందని విమర్శించారు. భారత్ రాష్ట్ర సమితి, మజ్లిస్‌ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో పోల్చిన మోదీ.. తెలంగాణ ప్రజలు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజలు కోరుకుంటున్న పారదర్శక ప్రభుత్వం ఏర్పడుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

PM Modi Announced Turmeric Board and Tribal University : 'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని

"తెలంగాణ సర్కార్‌ని నడిపే గులాబీ పార్టీ గుర్తు కారు. ఆ కారు స్టీరింగ్‌ ఎవరి చేతిలో ఉందో.. ఈ ప్రభుత్వాన్ని ఎవరిని నడుపుతారో మీ అందిరికీ తెలుసు. ఈ రెండు కుటుంబ పార్టీల వల్ల తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. ఈ రెండు పార్టీలు అవినీతికి, కమీషన్లకు పెట్టింది పేరు. రెండు పార్టీలకు ఉన్న ఫార్ములా కుటుంబం మాత్రమే. కుటుంబం ద్వారా, కుటుంబం కోసం , కుటుంబహితమే పరమావధిగా పనిచేస్తున్నాయి. వీకు ప్రజాస్వామ్యాన్ని కుటుంబ వ్యవస్థగా మార్చారు. రాజకీయపార్టీలను సైతం ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చేసి నడుపుతున్నారు. ఆ సదరు కంపెనీలో ప్రెసిడెంట్‌, సీఈవో, డైరెక్టర్‌, జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, మేనేజర్‌, ట్రెజరర్‌ సైతం కుటుంబ వ్యక్తులే నిర్వహిస్తారు. కానీ వారి అవసరాల కోసం మాత్రం సహాయకసిబ్బంది సాధారణ వ్యక్తులను నియమిస్తారు. అత్యున్నత పదవులను మాత్రం వారు అలంకరిస్తారు. మిగతావాళ్లకు మాత్రం అప్రాధాన్య పోస్టుల్లో భాగస్వామ్యం చేస్తారు." - నరేంద్ర మోదీ, ప్రధాని

PM Modi Comments on Telangana Government : రైతుల సంక్షేమాన్ని బీఆర్ఎస్ సర్కార్‌ (Telangana Government) గాలికొదిలేసిందని విమర్శించారు. సాగనీటి ప్రాజెక్టులపేరిట ప్రభుత్వ పెద్దలు దోపిడీ పర్వానికి తెరతీశారని ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కిన ప్రభుత్వం.. ఆ హామీని విస్మరించి.. కర్షకులను మోసం చేసిందని ఆక్షేపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌.. తెలంగాణ రైతులకు మేలు చేకూర్చే ఎన్నో పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోందని గణాంకాలతో సహా మోదీ వివరించారు. బీజేపీపై ప్రజలు చూపిస్తున్న ప్రేమను చూసి కాంగ్రెస్‌, బీఆర్ఎస్​కు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే సాగుదారులు ఆత్మహత్యలు పెరిగాయని మోదీ విమర్శించారు.

PM Modi Mahabubnagar District Tour : మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ.13,500 కోట్ల విలువైన పనులకు శ్రీకారం

PM Modi Telangana Tour : ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరితో తెలంగాణ తీవ్రంగా నష్టపోతోందని.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోనూ ప్రజలు.. బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరిన ఆయన.. అవినీతి లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కిషన్​రెడ్డి హామీ ఇచ్చారు. పాలమూరు ప్రజాగర్జన సభా వేదికగా వచ్చిన ప్రధాని మోదీకి.. పాలమూరు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మోదీ.. మోదీ అంటూ పూలు చల్లుతూ కేరింతలు కొట్టారు.

Kishan Reddy Comments on CM KCR : 'ప్రధాని మోదీ తెలంగాణకు వస్తుంటే.. కేసీఆర్ ఇంట్లో కూర్చొని కుట్రలు చేస్తున్నారు'

Last Updated : Oct 1, 2023, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.