ETV Bharat / bharat

కేదార్​నాథ్​లో మోదీ ప్రత్యేక పూజలు- ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణ - Kedarpuri

ఉత్తరాఖండ్​లోని కేదార్​నాథ్​ ఆలయంలో (Kedarnath temple) ప్రధాని నరేంద్ర మోదీ (Modi kedarnath visit) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం.. ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేదార్​నాథ్​లో అభివృద్ధి పనులను నిరంతరం సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు మోదీ.

PM Modi offers prayers at Kedarnath temple
కేదార్​నాథ్​ ఆలయంలో మోదీ పూజలు
author img

By

Published : Nov 5, 2021, 9:43 AM IST

Updated : Nov 5, 2021, 12:28 PM IST

కేదార్​నాథ్​లో మోదీ పూజలు- ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణ

శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ.. ఉత్తరాఖండ్​లో (Modi in uttarakhand today) పర్యటించారు. ముందుగా ఈ ఉదయం దేహ్రాదూన్​ చేరుకున్న ప్రధానికి.. రాష్ట్ర గవర్నర్​ గుర్మిత్​ సింగ్​, ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామీ స్వాగతం పలికారు.

PM Modi offers prayers at Kedarnath temple
మోదీకి స్వాగతం

కేదార్​నాథ్​లో మోదీ

అక్కడినుంచి.. నేరుగా కేదార్​నాథ్​ వెళ్లిన మోదీ (Modi kedarnath visit) ఆలయంలో కలియతిరిగారు. అనంతరం.. ప్రత్యేక పూజలు(Kedarnath temple) నిర్వహించారు. మహాశివుడికి నమస్కరించి.. హారతి ఇచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆలయం చుట్టూ ప్రదక్షిణలు

ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణ..

తర్వాత ఆది శంకరాచార్య సమాధి స్థల్‌ను (Shankaracharya samadhi) ప్రధాని మోదీ ప్రారంభించారు. 2019లో చేపట్టిన 12 అడుగుల ఎత్తు, 35 టన్నుల బరువుగల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదిశంకరాచార్యుల రచనలు ఎంతో మందిని ప్రభావితం చేశాయని మోదీ అన్నారు.

కేదార్​నాథ్​ ఆలయం

ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని

''మహనీయుల చరిత్రను మనం మననం చేసుకుందాం. ఆదిశంకరాచార్యుల రచనలు ఐక్యతను గుర్తుచేస్తాయి. ఉపనిషత్తుల్లో కనిపించే ఆలోచనలను విశదీకరిస్తాయి. పుణ్యక్షేత్రాల సందర్శనతో ఆధ్యాత్మిక చింతన చేకూరుతుంది. ఆదిశంకరాచార్య సమాధి స్థల్​.. ఆధ్యాత్మిక శ్రేయస్సుకు అపూర్వ దృశ్యం. కేదార్​నాథ్​లో అభివృద్ధి పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తున్నా. 2013 విధ్వంసం తర్వాత.. మళ్లీ అభివృద్ధి సాధ్యమా అనుకున్నాం. ఇవాళ కేదార్​నాథ్​లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.''

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణను దేశంలోని 12 జ్యోతిర్లింగాలు, 4 శంకరాచార్య మఠాలతోపాటు ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం..

అనంతరం.. రూ. 130 కోట్లతో కేదార్​నాథ్​లో చేపట్టే పునర్నిర్మాణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు మోదీ.

ప్రధాని పర్యటన (Kedarnath temple) నేపథ్యంలో.. రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భారీగా బలగాలను మోహరించారు.

ఇవీ చూడండి: పేపర్​ మిల్లులో అగ్ని ప్రమాదం- ఉవ్వెత్తున ఎగిసిన మంటలు

దీపావళి ఎఫెక్ట్​.. దిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత

Last Updated : Nov 5, 2021, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.