ETV Bharat / bharat

'పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామి'

pm Modi milk dairy opening: గుజరాత్​లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. బనాస్​కాంఠా జిల్లాలోని కొత్త డెయిరీ ప్లాంట్​ను, బంగాళదుంపల ప్రాసెసింగ్ ప్లాంట్​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ అగ్ర స్థానంలో ఉందని అన్నారు మోదీ.

pm modi milk dairy opening
ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన
author img

By

Published : Apr 19, 2022, 5:16 PM IST

pm Modi milk dairy opening: గుజరాత్​లోని మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ​బనాస్​కాంఠాలో నూతన డెయిరీ ప్లాంట్​తో పాటు బంగాళదుంపల ప్రాసెసింగ్ ప్లాంట్​ను ప్రారంభించారు. ఈ డెయిరీలో రోజుకు 30 లక్షల లీటర్ల పాలు, సుమారు 80 టన్నుల వెన్న, లక్ష టన్నుల ఐస్​క్రీం తయారవుతుంది. 20 టన్నుల కోవా, ఆరు టన్నుల చాక్లెట్ ఉత్పత్తి అవుతుంది.

pm modi milk dairy opening
పొటాటో ప్రాసెసింగ్ ప్లాంట్​ను పరిశీలిస్తున్న ప్రధాని మోదీ

ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారత్​ అగ్రస్థానంలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. పాల ఉత్పత్తి టర్నోవర్​.. గోధుమలు, బియ్యం ఉత్పత్తి కంటే ఎక్కువే అని తెలిపారు. భారత్​లో ఏటా రూ.8.5 లక్షల కోట్ల విలువైన పాలను భారత్ ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. చిన్న రైతులే.. పాడి పరిశ్రమ అతిపెద్ద లబ్ధిదారులని అన్నారు. సహకార డెయిరీ.. చిన్న రైతులను, మహిళలను, గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు.

pm modi milk dairy opening
పొటాటో ప్రాసెసింగ్ ప్లాంట్​లో తయారైన ఆహారోత్పత్తులను పరిశీలిస్తున్న ప్రధాని మోదీ

బనాస్ డెయిరీ ఆసియాలోని ప్రముఖ పాల ఉత్పత్తి తయారీ కంపెనీలలో ఒకటిగా పేరు పొందింది. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సన్నకారు రైతులకు అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశవ్యాప్తంగా ఉన్న సన్నకారు రైతుల బాధ్యతను తాను తీసుకున్నానని తెలిపారు. అందుకే సంవత్సరానికి రూ.6000 రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. అక్కడి మహిళలు తమ పిల్లల కంటే కూడా ఎక్కువ ప్రేమతో పశువులను చూసుకుంటున్నారని మోదీ ప్రశంసించారు.

pm modi milk dairy opening
బనాస్ డెయిరీని ప్రారంభించిన మోదీ

పొటాటో ప్రాసెసింగ్​ ప్లాంట్​లో.. ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, ఆలూ టిక్కీ, ప్యాటీస్ మొదలైన ఉత్పత్తులు తయారవుతాయి. వీటిలో చాలా వరకు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి.

ఇదీ చదవండి: 4 రోజుల్లో 3 భేటీలు.. 6 రాష్ట్రాలకు 'పీకే' స్కెచ్ రెడీ.. రాహుల్​కు ఓకే.. కానీ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.