కరోనా యోధుల కోసం కస్టమైజ్డ్ క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 26 రాష్ట్రాల్లో 111 శిక్షణ కేంద్రాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి మోదీ (PM Modi) శ్రీకారం చుట్టారు. దీని ద్వారా లక్ష మందిలో పని సామర్థ్యాన్ని పెంచేలా శిక్షణ ఇవ్వనున్నారు.
ఇంట్లోనే కరోనా రోగులకు సేవలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందనపై శిక్షణ ఇవ్వనున్నారు. నమూనాల సేకరణ, వైద్య పరికరాల వినియోగంపై తర్ఫీదు ఇస్తారు. ఈ శిక్షణ కోసం ప్రధాని కౌశల్ వికాస్ యోజన కింద రూ.276 కోట్లు కేటాయించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
క్రాష్ కోర్స్‌ను రెండు మూడు నెలల్లో నిపుణులు రూపొందించనున్నారని ప్రధాని తెలిపారు. శిక్షణ పొందినవారు కరోనాపై పోరులో పాల్గొననుట్లు వెల్లడించారు. అలాగే కరోనాపై పోరులో భాగంగా.. 1500 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అన్ని జిల్లాలకు మెడికల్ ఆక్సిజన్ అందించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: నదిలో చిక్కుకున్న150 మంది- రక్షించిన ఎన్డీఆర్ఎఫ్