కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అనుసరించే వ్యూహాలు.. క్రియాశీలకంగా, సరికొత్తగా ఉండాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులతో మోదీ సమావేశమయ్యారు. వైరస్ను 'కుట్రధారి', 'బహురూపకారి'గా అభివర్ణించారు. రానున్న రోజుల్లో యువత, చిన్నారులపై వైరస్ అధిక ప్రభావం చూపుతుందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో.. అధికారులు దృష్టిసారించాలని సూచించారు.
"జిల్లాల్లో మహమ్మారి వ్యాప్తిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి వైరస్ తీవ్రతను అంచనా వేయాలి. వ్యాక్సిన్ దుర్వినియోగాన్ని అరికట్టాలి. ప్రతి డోసు.. మరొకరి ప్రాణానికి రక్షణ. నూతన సవాళ్లే.. సరికొత్త పరిష్కారాలను చూపుతాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ప్రస్తుతం ఉన్న వనరులను ఉపయోగించుకుని వైరస్ను సమర్థవంతంగా కట్టడి చేస్తున్న జిల్లా అధికారులను మోదీ ప్రశంసించారు. కేసులు తగ్గినా.. వైరస్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేంత వరకూ కృషి చేయాలని సూచించారు.
ఇదీ చదవండి : పల్లె ప్రాంతాల్లో కరోనా కట్టడి ముఖ్యం!