ETV Bharat / bharat

మోదీ స్ఫూర్తితో 'చాయ్​వాలా'గా ఇంజినీర్​!

ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఓ యువ ఇంజినీర్​ చాయ్​వాలాగా మారాడు. చాయ్​వాలా ప్రధాని కాగాలేనిది.. ఓ ఇంజినీర్​ చాయ్​వాలా ఎందుకు కాకూడదు అంటున్నాడు. అసలు దీనికి కారణాలేంటంటే..

Engineer become a tea seller
ప్రధాని మోదీ స్ఫూర్తితో చాయ్​వాలాగా మారిన ఇంజనీర్​
author img

By

Published : Jul 5, 2021, 4:52 PM IST

టీకొట్టు ఏర్పాటు చేసుకున్న అమిర్​ సోనల్​

ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో గుజరాత్​కు చెందిన ఓ యువ ఇంజినీర్​ తనదైన దారిలో నడుస్తున్నాడు. పనితో సంబంధం లేకుండా ఆదాయ మార్గాలను వెతుక్కున్నాడు. ఉన్నత చదువులు చదివి.. చాయ్​వాలాగా మారాడు. వృత్తి ఏదైనా సరే అంకుర సంస్థలు స్థాపించాలని అంటున్నాడు.

బాగాల్​కోట్​ జిల్లా కలలాగి గ్రామానికి చెందిన యువకుడు అమిర్ సోనల్​. మెకానికల్​ ఇంజినీరింగ్​లో డిప్లమా పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్లాడు. టొయెటా కంపెనీలో చదువుకు తగ్గ ఉద్యోగం సైతం పొందాడు. కానీ శ్రమకు తగ్గ ఫలితం అందట్లేదని భావించి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఏదైనా సొంత వ్యాపారం స్థాపించాలనుకున్నాడు.

"చాయ్​వాలా దేశానికి ప్రధాని అయ్యారు. అలాంటప్పుడు ఒక ఇంజినీర్​.. చాయ్​వాలా ఎందుకు కాకూడదు. వృత్తి ఏదైనా సరే అంకుర సంస్థలను స్థాపించాలి. వ్యాపారం, ఆదాయవ్యయాలు మాత్రమే ప్రధానమైనవి. అంకితభావంతో పనిచేస్తే తప్పకుండా లాభాలు అర్జించవచ్చు."

- అమిర్ సోనల్​

బాగాల్​కోట్​ పట్టణంలో ఓ టీ షాప్​ను స్థాపించాడు అమిర్​. అక్కడ బిస్కెట్​​, కేక్, బన్​, టీ అమ్ముతున్నాడు. అయితే.. ఆ షాప్​కు 'చాయ్​వాలాగా మారిన ఇంజినీర్' అని పేరు పెట్టాడు. 'ఇక్కడ టెక్నికల్ చాయ్ లభించును' అనే ట్యాగ్​లైన్​ను సైతం బ్యానర్​లో రాశాడు. ప్రతీరోజు దాదాపు వెయ్యి కప్పుల టీని అమ్మేవాడు. కరోనా కారణంగా ఆ సంఖ్య 500కు పరిమితమైంది. రెండు, మూడు నెలల్లోనే వ్యాపారం మళ్లీ సాధారణ స్థితికి వస్తుందని అమిర్​ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.