భారత్లో కరోనా ఉద్ధృతి.. విదేశీ ప్రతినిధులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముందస్తుగా ఖరారైన భేటీలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ డ్రియన్, మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్లు మోదీతో సమావేశం కావాల్సి ఉంది. అయితే ఈ భేటీలు జరగలేదు.
దేశంలో వైరస్ పరిస్థితిపై మోదీ వరుస సమీక్షలు జరుపుతున్నందున.. ఆయనతో విదేశీ ఉన్నతాధికారుల సమావేశాలను కొద్ది రోజులపాటు నిలిపివేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మహమ్మారిపై ఇటీవల అన్ని రాష్ట్రాల గవర్నర్లతో భేటీ అయిన ప్రధాని... సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.
బోరిస్ పర్యటన కుదింపు..
దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటనను కుదించారు. ముందస్తుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం జాన్సన్.. చెన్నైకి వెళ్లాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దిల్లీలో మోదీ సహా బడా వ్యాపారవేత్తలతోనే సమావేశమవుతారని సమాచారం.
ఇదీ చూడండి: 'కరోనాను జయించడానికి ప్రపంచం ఐక్యం కావాలి'