ETV Bharat / bharat

'డ్రోన్ రంగంలో భారత సామర్థ్యాలు భేష్.. ప్రపంచానికే లీడర్​గా...'

author img

By

Published : Feb 19, 2022, 11:58 AM IST

MODI flags off Kisan Drones: దేశంలో డ్రోన్ల వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ అన్నారు. అందుకోసం ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ప్రభుత్వం సరికొత్త విధానాలు అవలంబిస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగంలో వినూత్మ మార్పులకు శ్రీకారం చుట్టేలా 100 కిసాన్​ డ్రోన్ల సేవలను మోదీ ప్రారంభించారు.

మోదీ
MODI

Modi flags off Kisan Drones: డ్రోన్ రంగంలో పెరుగుతున్న భారత సామర్థ్యాలు ప్రపంచానికి సరికొత్త నాయకత్వాన్ని అందిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పొలాల్లో పురుగుల మందులు, ఎరువులు పిచికారీ చేసేందుకు ఉపయోగించే కిసాన్ డ్రోన్లను ఆయన ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఒకేసారి 100 కిసాన్ డ్రోన్లను ఆవిష్కరించారు. వర్చువల్​గా జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా.. హరియాణాలోని మనేసర్ రైతులతో మోదీ మాట్లాడారు.

  • Glad to have witnessed Kisan Drones in action at 100 places across the country. This is a commendable initiative by a vibrant start-up, @garuda_india.

    Innovative technology will empower our farmers and make agriculture more profitable. pic.twitter.com/x5hTytderV

    — Narendra Modi (@narendramodi) February 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇంతకు ముందు వరకు డ్రోన్లు సాయుధ బలగాలకు, శత్రువులతో పోరాడేందుకే అని ఉద్దేశం ఉండేది. ఇప్పుడు వ్యవసాయ రంగంలోనూ వాడుతున్నాం. ప్రస్తుతం దేశంలో 200 కంటే ఎక్కువగా డ్రోన్ల స్టార్టప్​లు ఉన్నాయి. త్వరలో అవి 1000కి పెరుగబోతున్నాయి. భారతదేశంలో డ్రోన్ల మార్కెట్ అభివృద్ధి..యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది."

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

గరుడ ఏరోస్పేస్​ సంస్థ రాబోయే రెండు సంవత్సరాల్లో లక్షకుపైగా డ్రోన్లను తయారుచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. గత కొన్నాళ్లుగా దేశంలో చేపట్టిన సంస్కరణలు యువతతో పాటు ప్రైవేటు రంగానికి బలం చేకూర్చాయని ఆయన అన్నారు.

"ఇటీవల బీటింగ్ రిట్రీట్ వేడుకలో వెయ్యి డ్రోన్లను ప్రదర్శించాం. స్వామిత్వ పథకం కింద డ్రోన్ టెక్నాలజీ ద్వారా భూమి రికార్డులను డాక్యుమెంట్ చేస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాలకు మందులు, వ్యాక్సిన్‌లు డ్రోన్ల ద్వారానే సరఫరా చేస్తున్నాం. పొలాల నుంచి నేరుగా మార్కెట్‌కు కూరగాయలు, పండ్లు, చేపలను తీసుకెళ్లేందుకు అధిక సామర్థ్యం గల డ్రోన్‌లను వినియోగించడం.. సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుంది. ఆ లక్ష్యంతోనే బడ్జెట్‌లో సాంకేతికత, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిచ్చాం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్​ను ప్రవేశపెట్టినప్పుడే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ కిసాన్​ డ్రోన్ల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా రైతులకు డిజిటల్​ సేవలు అందిస్తామని తెలిపారు. ఆ సేవలను అందించే క్రమంలో ప్రభుత్వ- ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని నిర్మల పేర్కొన్నారు. భూరికార్డుల డిజిటలైజేషన్​, పురుగుమందులు, పోషకాలను పిచకారీ చేయడం కోసం కిసాన్​ డ్రోన్లను ప్రారంభిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: 'బుల్​డోజర్లు రిపేర్​లో ఉన్నాయ్.. ఫలితాల తర్వాత వారి పని పడతాయ్​!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.